విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌లోని కెమిస్ట్రీ విభాగానికి చెందిన గుడిసే వీరబాబు అనే విద్యార్థికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ బుధవారం పీహెచ్‌డీ పట్టా అందజేసిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం తెలిపింది. ‘‘ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ స్పైరోక్రోమాన్స్, టెట్రాహైడ్రో– స్పైరోపైరాన్స్‌ అండ్‌ బిస్‌– స్పైరోసైక్లోహెక్సేన్స్‌: కాస్కేడ్‌ రియాక్షన్స్‌ యూజింగ్‌ 1,3– ఇండేన్‌డయోన్, నైట్రోస్టైరిన్‌ అండ్‌ ఇట్స్‌ మోరిటా–బేలిస్‌– హిల్‌మాన్‌ (ఎంబీహెచ్‌) అడక్ట్స్‌’’’’ అనే అంశంపై విద్యార్థి పరిశోధన చేశారని తెలిపింది. గుడిసే వీరబాబు అనే విద్యార్థికి యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ షేక్‌ అన్వర్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. విద్యార్థి తన పరిశోధనలో భాగంగా మొత్తం 9 ఎస్‌సీఐఈ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసింది. పీహెచ్‌డీ పట్టా పొందిన గుడిసే వీరబాబును ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.