విజ్ఞాన్స్‌లో ప్రారంభమైన ఎన్‌సీసీ క్యాంప్‌

విజ్ఞాన్స్‌లో ప్రారంభమైన ఎన్‌సీసీ క్యాంప్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో 25(ఏ) బెటాలియన్‌ ఎన్‌సీసీ క్యాంప్‌ ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరులోని 25 (ఏ) బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ వీరేంద్రసింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ఈ క్యాంప్‌ను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఈ క్యాంప్‌కు గుంటూరు గ్రూప్‌ పరిధిలో ఉన్న ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి 600 మంది విద్యార్థులు ఈ క్యాంప్‌కు హాజరయ్యారని పేర్కొన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే ఇంటర్‌ బెటాలియన్‌ కాంపీటీషన్స్‌ పోటీలలో వివిధ రకాల డ్రిల్స్, కల్చరల్స్, ఫైరింగ్, బెస్ట్‌ క్యాడెట్స్, ఫ్లాగ్‌ ఏరియా విభాగాలలో విద్యార్థులను ఎంపిక చేయబడుతుంది. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను వచ్చే సంవత్సరం న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికవుతారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ క్యాంప్‌ ఏవో, ఎస్‌ఎం, ఏఎన్‌వోలు, పీఐ స్టాఫ్, సూపరింటిండెంట్, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.