ఘనంగా ఏ.ఐ. టి.యూ.సి ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా ఏ.ఐ. టి.యూ.సి ఆవిర్భావ దినోత్సవం.
తెనాలి: అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏ.ఐ. టి.యూ.సి) 103వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలిలో సోవవారం ఏ.ఐ. టి.యూ.సి తెనాలి డివిజన్ అధ్యక్షుడు, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అడిషినల్ జనరల్ సెక్రటరీ ఎస్. గురు బ్రహ్మం ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంస్ధ అయిన ఏ.ఐ. టి.యూ.సి కి 103 సంవత్సరాల ఘన చరిత్ర ఉందని గురు బ్రహ్మం అన్నారు. 1920 సంవత్సరం లో అక్టోబర్ 31 న ఏ.ఐ. టి.యూ.సి ఆవిర్భవించిందన్నారు. దేశ ప్రజలందరికీ సంపూర్ణ స్వతంత్రం, స్వేచ్ఛ, సమానత్వంతో పాటు కార్మికవర్గ హక్కుల పరిరక్షణ ఆశయంగా ఏ.ఐ. టి.యూ.సి పనిచేస్తుందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో లోను ఏ.ఐ. టి.యూ.సి కీలకపాత్ర పోషించిందన్నారు.
విద్యుత్ రంగంలో కార్మికుల ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న సంఘం ఏఐటీయూసీ  అసంఘటిత కార్మికుల సమస్యల కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నది
అందులో భాగంగానే ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో తొలుత  ఏ ఐ టి యూ సి జండాను గురు బ్రహ్మం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మునిపల్లి శ్రీకాంత్, జె.వి.జీ రాంబాబు, డివిజన్ నాయకులు వెంకటేశ్వరరావు, సత్య శివరాం, సురేష్, శ్రీనివాస్, గోపి, ఖాన్, బి. గోపి, ప్రవీణ్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.