Skip to main content

రాజమండ్రి రౌండ్ టేబల్ కాన్ఫరెన్స్ లో మేధావుల మేధోమధనం - మూడు రాజధానులకే సుముఖం

ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు ఓ రాజధాని అంటూ లేకుండా చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి పై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మండిప‌డ్డారు. సోమ‌వారం రాజమండ్రిలో పాలనా వికేంద్రీకరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ అధ్యక్షతన కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వ‌ర్యంలో ఈ సభ జ‌రిగింది. ఇందులో ప‌లువురు మేధావులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి చంద్రబాబే కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చిన దానికోసం ఒక్క మాట కూడా మాట్లాడని చంద్ర‌బాబు..మూడు రాజధానిల్లో ఒకటైన విశాఖపట్నం ఎంపిక పై రైతులను ఉసిగొల్పుతున్నారు’ అని ఫైర్ అయ్యారు. రాజ‌ధాని విష‌యంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేద‌ని టీడీపీ చీఫ్ పై మంత్రి మండిపడ్డారు. కమిటీ సిఫార్సులను చంద్ర‌బాబు ఆమోదించి ఉంటే, ఇప్పుడు రాష్ట్రానికి ఈ సమస్య ఎదుర‌య్యేది కాద‌న్నారు. ఆనాడు కమిటీ మూడు ప్రాంతాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించాలని కోరింద‌ని.. అయితే చంద్ర‌బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ నివేదికను విస్మరించార‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ అని.. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిందని వివరించారు. కనీస వ్యయంతో విశాఖ‌ నగరం మంచి రాజధానిగా మారే అవకాశం ఉంద‌ని.. అందుకే ఇది మంచి ఎంపికని చెప్పుకొచ్చారు.

రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. శివరామ కృష్ణన్ కమిటీ నివేదికను ప్ర‌స్తావించారు. ‘రాజ‌ధాని తక్షణ అవసరాల కోసం 1,500 ఎకరాలను, భవిష్యత్తు అవసరాల కోసం 3 వేల‌ ఎకరాలను పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ సూచించింది. అయితే రియల్ ఎస్టేట్ చేసి లాభాలు పొందేందుకు చంద్ర‌బాబు 33,700 ఎకరాలు స‌మీక‌రించారు. ఆయ‌న‌ వ్యాపార ప్రయోజనాల కోసం రైతుల‌ను మోసం చేశారు’ అని మండిప‌డ్డారు.
 
ఆనాడు అమరావతిని ఏకైక రాజధానిగా ప్ర‌క‌టించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ పద్మలత అన్నారు. రాజ‌ధాని నిర్మాణాలు ప్రారంభమైనప్పుడు, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఒకే కులం ఆధిపత్యం ఉందని గమనించిన‌ట్లు చెప్పుకొచ్చారు. కానీ విశాఖలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. వైజాగ్ విభిన్న సంస్కృతులు, సమాజాల సమ్మేళనమ‌ని.. పోర్ట్, విమానాశ్రయం  అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే, ఇది కార్యనిర్వాహక రాజధానిగా పేరు పెట్టడానికి అర్హమైనదని అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్రాంతీయ అసమానతలను రూపుమాపడం చాలా ముఖ్యమని, మూడు రాజధానులు అనే ప్రస్తుత విధానం అన్ని ప్రాంతాల అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రముఖ రచయిత యర్రాప్రగడ రామకృష్ణ అన్నారు. 

అబ్దుల్ కలాం స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ఆరీఫ్ మాట్లాడుతూ.. ఒకే రాజధాని విధానం అనాలోచిత నిర్ణ‌య‌మ‌న్నారు. 

సమావేశంలో ఐ అండ్ పీఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...