Skip to main content

Posts

Showing posts from November, 2022

చిత్రకారుడు తిమ్మిరి రవీంద్ర కు గౌరవ డాక్టరేట్ ప్రధానం

చిత్రకారుడు తిమ్మిరి రవీంద్ర కు గౌరవ డాక్టరేట్ ప్రధానం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఒంగోలు నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు తిమ్మిరి రవీంద్ర కు గత 30 సంవత్సరాలుగా చిత్రకళా రంగంలో చేసిన సేవలు మరియు సాధించిన విజయాలకు గాను ఫైన్ ఆర్ట్స్ విభాగంలో అమెరికాకు చెందిన డే స్ప్రింగ్  యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను బెంగళూరు లో హెబ్బల్  లోని ఇండియన్ సొసైటీ హాల్ లో జరిగిన డే స్ప్రింగ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ సభలో తిమ్మిరి రవీంద్ర కు గౌరవ డాక్టరేట్ దృవీకరణ పత్రము మరియు బంగారు పథకాన్ని అమెరికాకు చెందిన Mr. Dylen guest, Dr. Amos James, DCU, ఇండియా రిప్రజెంటేటివ్. Dr. రవికుమార్ బెంగళూరుDCU డైరెక్టర్,Dr. వెంకటేష్ NGO చైర్మన్ బెంగళూరు. వారు అందజేసి చిత్రకళ రంగాన్ని మరింత అభివృద్ధి పదంలో నడపాలని అభినందించారు. చిత్రకారుడు తిమ్మిరి రవీంద్ర మాట్లాడుతూ  డేస్ప్రింగ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ విజయాలకు  నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మా చిత్రకారులు, కుటుంబ సభ్యులు,చిత్రకారు...

మేరుగ జయరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నాగార్జున

మేరుగ జయరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నాగార్జున తెనాలి: స్థానిక చినరావూరు తోటలో మృతి చెందిన మేరుగ జయరావు కుటుంబసభ్యులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. మంగళవారం సాయంత్రం జయరావు స్వగృహానికి విచ్చేసి   ఘన నివాళులు అర్పించారు. కుటుంభం సబ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో జయరావు నిబద్ధతగా పనిచేశారన్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదల ఉన్నతికి పాటుపడ్డారన్నారు. పరామర్శించిన వారిలో రేపల్లె మునిసిపల్ కమిషనర్ బి. పార్థ సారధి, దర్శకులు కనపర్తి రత్నాకర్, పారిశ్రామిక వేత్త పి. జితేంద్ర, బ్లూ త్రీ సొల్యూషన్స్ డైరెక్టర్ తమనం రాకేష్, రాజేష్ మాజీ కౌనిలర్లు యల్లంకి రాధ, మన్నవ ప్రభాకర్, ముట్టడి ప్రకాష్, నటులు బాబురావు, డాక్టర్ రాగలత, డాక్టర్ విశ్వనాథ్, చుండూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కె. రమేష్   జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, పలువురు పట్టణ ప్రముఖులు వున్నారు.

మేరుగ జయరావు కన్నుమూత

మేరుగ జయరావు కన్నుమూత తెనాలి: వైద్య ఆరోగ్య శాఖ విశ్రాంత ఉద్యోగి, మాజీ కౌన్సిలర్ (బాపట్ల), కార్మిక సంఘ నేత, అభ్యుదయవాది  మేరుగ జయరావు ( 89)ఆదివారం రాత్రి అనారోగ్యంతో గుంటూరు ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆయనకు జయకరుణ, జయలలిత, జయశ్రీ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్థానిక చిన్నరావూరు తోటలోని ఆయన స్వగృహంలో జయరావు భౌతిక కాయాన్ని ఉంచారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు జయరావుకు ఘన నివాళులు అర్పించారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం నుంచి ఇప్పించడంలో ఆయన కృషి ఉందన్నారు. చిన్నారావూరు తోట లోని  మదర్ థెరిస్సా నగర్ ఏర్పడటానికి జయరావు ముఖ్యులని కొనియాడారు. పేదల పక్షపాతిగా పలు ఉద్యమాలు చేశారని గుర్తుచేసుకున్నారు.

డిసెంబర్ 9 న విడుదల

బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ

బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, తెనాలి: ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా, నవలా, కధా, రచయితగా అభ్యదయ సినీ రచయితగా, పత్రికా సంపాదకునిగా, సంగీత దర్శకునిగా, నటునిగా, స్త్రీ పాత్ర ధారిగా బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ అని అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సంపాదకులు గోలి సీతారామయ్య చెప్పారు. తెనాలి గాంధీనగర్ బొల్లిముంత శివరామకృష్ణ పౌండేషన్ హాలులో ఆదివారం బొల్లిముంత ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఇస్కఫ్ సంయుక్త ఆధ్వర్యంలో శివరామకృష్ణ 102 జయంతి సభలో ఆయన మాట్లాడారు. సభకు ఉపాధ్యాయ నాయకులు కనవర్తి బెనార్ అధ్యక్షత వహించారు. నీనారామయ్య తన ప్రసంగంలో తెలుగునేతలపై అమూల్యమైన సాహిత్యాన్ని సృష్టించారన్నారు. తెలంగాణా నైజాం, నవాబు పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు సేనానిగా బాగస్వాములై అచట వీడిత ప్రజల కష్టాలను కడగంట్లను అద్భుతంగా చిత్రీకరిస్తూ మృత్యుం జయలు, నవల రాశారన్నారు. అనేక కధలు నవలలు రాస్తూనే ప్రతిభ, ప్రగతి, నగరం ప్రజాప...

ప్రజా రచయిత బొల్లిముంత శివరామకృష్ణ

మార్క్సిస్టు గాంధీ "బొల్లిముంత  శివరామకృష్ణ" (నవంబర్ 27,1920జూన్ 7, 2005)  గారి పుట్టి న రోజు నేడు..!! *నూరేళ్ళు కాదు, వెయ్యేళ్ళు గుర్తుండిపోయే  ప్రజా రచయిత " బొల్లిముంత శివరామకృష్ణ "!! కొందరు పుడతారు గిడతారు.లోకంమరిచిపోతుం ది.మరికొందరు పుట్టి చిరకాలం ప్రజలు  గుండెల్లో  'చిరంజీవి'గా నిలిచిపోతారు.అటువంటివారే మన బొల్లిముంత శివరామకృష్ణ గారు.!! బొల్లిముంత శివరామకృష్ణ పుట్టి వందేళ్ళు దాటా యి. రెండేళ్ళ క్రితం తెనాలిలో ఆయన శతజయం తి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.నూరేళ్ళేమిటి?  మరో వెయ్యేళ్ళయినా, ప్రజలకు  గుర్తుండిపోయే ప్రజా రచయిత  బొల్లిముంత  శివరామకృష్ణ..... గారు.! అభ్యుదయ వాదిగా,ప్రజారచయితగా, ప్రజా కళాకారుడిగా,హేతువాదిగా,వామపక్షీయుడి గా తెలుగు సాహితీ లోకంలో నిశ్శబ్ద విప్లవానికి తెరతీసిన మార్క్సిస్టు గాంధీ ఆయన.! *జీవితం…సాహిత్యం..!! గుంటూరు జిల్లా చదలవాడలో అక్కయ్య, మంగమ్మ దంపతులకు 1920,నవంబర్ 27 న జన్మించారు….బొల్లిముంత శివరామకృష్ణ గారు.గుంటూరులోనే హయర్‌ గ్రేడ్ శిక్షణ ను  పూర్తిచేసి, తండ్రి చదలవాడలో ప్రారంభించిన పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా చ...

పట్టణం లో క్రిస్మస్ సందడి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా అత్యంతగా ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రీస్తు పుట్టుక దినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ నెలగా పాటించి వేకువజామున ఆయా చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. రానున్న క్రిస్మస్ సంధర్భంగా తెనాలి పట్టణం లోని ఆలయాలు క్రిస్మస్ శోభను సంతరించుకున్నాయి. స్థానిక బోస్ రోడ్ లోని టౌన్ చర్చ్, ఐతానగర్, చిన్నారావురు తదితర ప్రాంతాలలోని చర్చీలను విద్యుత్ తోరణాలతో  అలంకరించారు. చర్చీలపై భారీ స్టార్ లను ఏర్పాటై చేశారు. దీంతో పట్టణంలో క్రిస్మస్ వాతావరణం నెలకొంది. అన్ని చర్చీల్లో నేటి నుంచే 30 రోజుల పాటు క్రిస్మస్ ఆరాధనలు జరగనున్నాయి. 

కష్టకాలంలోను మానవాళికి వ్యవ‘‘సాయం

కష్టకాలంలోను మానవాళికి వ్యవ‘‘సాయం ’’  -  రాజస్థాన్‌లోని కోట అగ్రికల్చర్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్‌ డీసీ జోషి  మీ దగ్గరికే ఇండస్ట్రీలు : మైసూర్‌లోని సీఎస్‌ఐఆర్‌–సీఎఫ్‌టీఆర్‌ఐ చీఫ్‌ సైంటిస్ట్, ఫుడ్‌ ప్యాకెజింగ్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ రాజేశ్వర్‌ ఎస్‌ మాచే విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్: కరోనా కష్టకాలంలో మానవాళికి ఆహారాన్ని అందించడంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన ఘనత వ్యవసాయ రంగానికే దక్కుతుందని రాజస్థాన్‌లోని కోట అగ్రికల్చర్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్‌ డీసీ జోషి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలోని ఫుడ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ఇన్నోవేటివ్‌ ఫుడ్‌ సిస్టమ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ ఫర్‌ సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ అగ్రో–ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సెక్టార్‌’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై...

మీ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే.. నాకు మద్దతివ్వండి

మీ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే.. నాకు మద్దతివ్వండి - చంద్రబాబు నాయుడు కలియుగ కబ్జాదారుడు, రావణుడు- రాజకీయమంటే ఒక జవాబుదారీతనం, మోసం చేసే చంద్రబాబు కి గుడ్ బై  చెప్పండి - సీఎం జగన్ టాలెంట్ ఎక్స్ ప్రెస్: ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం. 17వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కొంద గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు. ఆగస్ట్‌, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతందిని సీఎం జగన్‌ తెలిపారు. తాను చేసిన ప్రభుత్వ సంస్కరణలను వివరిస్తూ సీఎం జగన్ ప్రజలను మోసగాళ్ల మాట నమ్మద్దని కోరారు. తనకు తాను పార్టీ...

ఇండోర్ స్టేడియం పనులను వేగవంతం చేయండి

ఇండోర్ స్టేడియం పనులను వేగవంతం చేయండి  -కమిషనర్ అనుపమ అంజలి టాలెంట్ ఎక్స్ ప్రెస్: తిరుపతి తుడా మైదానం ప్రక్కన జరుగుతున్న ఇండోర్ స్టేడియం పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి అనుపమ అంజలి అన్నారు. ఇండోర్ స్టేడియం పనులను బుధవారం ఆమె పరిశీలించారు. పనులు చాలా ఆలస్యం అవుతున్నాయని కాంట్రాక్టర్ కి చెబుతూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ 6 కోట్ల రూపాయాలతో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న ఈ ఇండోర్ స్టేడియంలో షటీల్, కబాడి, బాస్కెట్ బాల్, జిమ్నాయిజం కోర్టులు ఆటలు ఆడేందుకు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే క్రీడాకారులకే కాకుండ తిరుపతి ప్రజలకు కూడా ఓక మంచి ఇండోర్ క్రీడా సముదాయం ఉత్సహాన్ని కల్గిస్తుందని కమిషనర్ అనుపమ తెలిపారు. వచ్చే రెండు నెలల్లోపు ఈ స్టేడియంను క్రీడాకారులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు పూర్తి చేయాలని సంబందిత కాంట్రాక్టర్లకు తెలిపినట్లు కమిషనర్ అనుపమ వివరించారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏయికామ్ సం...

అమిరినేని సాంబశివరావు జ్ఞాపకార్థం వృద్దులకు అన్న దానం

అమిరినేని సాంబశివరావు జ్ఞాపకార్థం వృద్దులకు అన్న దానం తెనాలి: ఇటీవల స్వర్గస్థులైన జి. డి.సి.సి. విశ్రాంత ఉద్యోగి అమిరినేని సాంబశివరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట శివరామ ప్రసాద్ మిత్రమండలి వృద్దులకు అన్నదానం నిర్వహించారు. స్థానిక మహాత్మా గాంధీ సేవ శాంతి ఆశ్రమం లో  సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమం లో దర్శకుడు కనపర్తి రత్నాకర్, వాసిరెడ్డి బదరి ప్రసాద్, గోగినేని గోపిచంద్, కె. వెంకటేష్, రజిని, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సాంబశివరావు సేవలను  ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి కొనియాడారు.

శ్రద్ధాంజలి

అమిరినేని సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించిన పలువురు ప్రముఖులు

అమిరినేని సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించిన పలువురు ప్రముఖులు తెనాలి: జి. డి. సి.సి బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి, సంఘ సేవకులు ఇటీవల స్వర్గస్థులైన స్వర్గీయ అమిరినేని సాంబశివరావు కుటుంబాన్ని గురువారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. స్థానిక జె.ఎం.జె కళాశాల సమీపంలోని ఆయన స్వగృహంలో సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంబశివరావు కుటుంబసభ్యులను ప్రవాస భారతీయులు అమిరినేని వెంకటేశ్వర్లు (బుల్లి) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్, తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్, వేమూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎం. సుబ్బారావు, జర్నలిస్టులు ప్రేమ్ కుమార్ లు పరామర్శించారు. సాంబశివరావు కుమారుడు, ప్రవాసాంధ్రులు అమిరినేని ప్రసాద్, భార్య ఉషా కుమారి, కుమార్తెలు శ్రీదేవి, శ్రీలతలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంస్మరణ కార్యక్రమంలో పాములపాటి మల్లిఖార్జునరావు, శ్రీధర్, మధుసూదనరావు, అమిరినేని రామలింగేశ్వరరావు, అడుసుమల్లి శ్రీనివాసరావు  రజిని, శ్యాంమల, సాహితీ, సాత్విక తదితరులు పాల్గొన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మృతితెనాలి కళారంగానికి తీరనిలోటు

సూపర్ స్టార్ కృష్ణ మృతి తెనాలి కళారంగానికి తీరనిలోటు - దర్శకుడు రత్నాకర్ తెనాలి: డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ రంగంతో పాటు ప్రత్యేకంగా తెనాలి కళా రంగానికి తీరని లోటని దర్శకుడు రత్నాకర్ కనపర్తి అన్నారు. పలుసందర్భాల్లో కృష్ణను కలసిన ఆయన కృష్ణ తో అనుబంధం ఉందన్నారు. తెనాలి వాసులు గర్వంగా మా తెనాలి  వాసి కృష్ణ అని చెప్పుకుంటారని నేడు ఆయన లేని లోటు తెనాలి ప్రాంత వాసులకు తీర్చలేనిదన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు రత్నాకర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పాత్రికేయుడు శ్యామ్ కుటుంబానికి ఆర్థికసాయం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఇటీవల ఆకస్మిక మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కందుల శ్యామ్ కుటుంబ సభ్యులను వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ మంగళవారం పరామర్శించి వారి కుటుంబానికి 25 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ మంచికి మారుపేరుగా నీతి నిజాయితీలతో పనిచేసిన శ్యామ్ ఆకస్మిక మరణం తీరనిలోటని అన్నారు. సంక్షేమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తమనం భూషణం మాట్లాడుతూ జర్నలిస్టు శ్యామ్ మరణం తీరని లోటని తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో తనకంటూ పత్రికా రంగంలో ఒక ముద్ర వేసుకొని మంచి వార్తలు రాసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. శ్యామ కుటుంబానికి అండగా నిలిచి వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ అభినందనీయులని ప్రశంసించారు. బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ మట్లపూడి సైమన్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడుతున్న హార్వెస్ట్ ఇండియా అధినేత ప్రశంసనీయులని పేర్కొన్నారు.  అనంతరం నిర్మాణంలో ఉన్న చర్చిని డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి ప...

దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు

దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు           _  సూపర్‌స్టార్‌’ కృష్ణ ఇకలేరు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీర్‌ చేయాలనుకున్నారు. కానీ, సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగంవైపు వచ్చేశార...

అమిరినేనికి ఎమ్మెల్యే శివకుమార్ ఘననివాళి

అమిరినేనికి ఎమ్మెల్యే శివకుమార్ ఘననివాళి తెనాలి: విశ్రాంత జీ. డి.సి.సి బ్యాంక్ ఉద్యోగి, సంఘసేవకులు అమిరినేని సాంబశివరావు (82) అనారోగ్యంతో ఆయన స్వగృహము సరళనగర్ తెనాలిలో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విచ్చేసి సాంబశివరావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళ్ళ అర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. సాంబశివరావుకు భార్య ఉషాదేవి, కుమారుడు అమిరినేని ప్రసాద్ లతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సందర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, జర్నలిస్ట్, దర్శకుడు కనపర్తి రత్నాకర్, జర్నలిస్టులు మునిపల్లి శ్రీకాంత్, ఎం. సుబ్బారావు, ప్రేమ్ కుమార్, శేఖర్, రవికుమార్,పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

సమయాన్ని పట్టించుకోవద్దు

సమయాన్ని పట్టించుకోవద్దు   హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్‌   ఉపాధి కల్పించాలి : యూఎస్‌ఏలోని జీనోమిక్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ రత్నగిరి పోలవరపు   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ పరిశోధన రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు సమయాన్ని పట్టించుకోకూడదని హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్‌ బుధవారం అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సైన్సెస్‌ విభాగాల ఆధ్వరంలో ‘‘ ఫ్రాంటీర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్, మెడికల్‌ జీనోమిక్స్‌ అండ్‌ డ్రగ్‌ డిస్కవరీ (ఇన్‌బిక్స్‌–22)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్‌ మాట్లాడుతూ పరిశోధన చేసే విద్యార్థులకు ఓపిక, సహనంతో పాటు కష్టపడేతత్వం ఉండ...