అమిరినేనికి ఎమ్మెల్యే శివకుమార్ ఘననివాళి

అమిరినేనికి ఎమ్మెల్యే శివకుమార్ ఘననివాళి
తెనాలి: విశ్రాంత జీ. డి.సి.సి బ్యాంక్ ఉద్యోగి, సంఘసేవకులు అమిరినేని సాంబశివరావు (82) అనారోగ్యంతో ఆయన స్వగృహము సరళనగర్ తెనాలిలో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విచ్చేసి సాంబశివరావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళ్ళ అర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. సాంబశివరావుకు భార్య ఉషాదేవి, కుమారుడు అమిరినేని ప్రసాద్ లతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సందర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, జర్నలిస్ట్, దర్శకుడు కనపర్తి రత్నాకర్, జర్నలిస్టులు మునిపల్లి శ్రీకాంత్, ఎం. సుబ్బారావు, ప్రేమ్ కుమార్, శేఖర్, రవికుమార్,పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.