ఇండోర్ స్టేడియం పనులను వేగవంతం చేయండి

ఇండోర్ స్టేడియం పనులను వేగవంతం చేయండి  -కమిషనర్ అనుపమ అంజలి
టాలెంట్ ఎక్స్ ప్రెస్:
తిరుపతి తుడా మైదానం ప్రక్కన జరుగుతున్న ఇండోర్ స్టేడియం పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి అనుపమ అంజలి అన్నారు. ఇండోర్ స్టేడియం పనులను బుధవారం ఆమె పరిశీలించారు. పనులు చాలా ఆలస్యం అవుతున్నాయని కాంట్రాక్టర్ కి చెబుతూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ 6 కోట్ల రూపాయాలతో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న ఈ ఇండోర్ స్టేడియంలో షటీల్, కబాడి, బాస్కెట్ బాల్, జిమ్నాయిజం కోర్టులు ఆటలు ఆడేందుకు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే క్రీడాకారులకే కాకుండ తిరుపతి ప్రజలకు కూడా ఓక మంచి ఇండోర్ క్రీడా సముదాయం ఉత్సహాన్ని కల్గిస్తుందని కమిషనర్ అనుపమ తెలిపారు. వచ్చే రెండు నెలల్లోపు ఈ స్టేడియంను క్రీడాకారులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు పూర్తి చేయాలని సంబందిత కాంట్రాక్టర్లకు తెలిపినట్లు కమిషనర్ అనుపమ వివరించారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏయికామ్ సంస్థ భాలాజీ, సంబందిత కాంట్రాక్టర్ పాల్గొన్నారు.*