పట్టణం లో క్రిస్మస్ సందడి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ప్రపంచ వ్యాప్తంగా అత్యంతగా ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రీస్తు పుట్టుక దినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ నెలగా పాటించి వేకువజామున ఆయా చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. రానున్న క్రిస్మస్ సంధర్భంగా తెనాలి పట్టణం లోని ఆలయాలు క్రిస్మస్ శోభను సంతరించుకున్నాయి. స్థానిక బోస్ రోడ్ లోని టౌన్ చర్చ్, ఐతానగర్, చిన్నారావురు తదితర ప్రాంతాలలోని చర్చీలను విద్యుత్ తోరణాలతో
 అలంకరించారు. చర్చీలపై భారీ స్టార్ లను ఏర్పాటై చేశారు. దీంతో పట్టణంలో క్రిస్మస్ వాతావరణం నెలకొంది. అన్ని చర్చీల్లో నేటి నుంచే 30 రోజుల పాటు క్రిస్మస్ ఆరాధనలు జరగనున్నాయి.