Skip to main content

ప్రజా రచయిత బొల్లిముంత శివరామకృష్ణ

మార్క్సిస్టు గాంధీ "బొల్లిముంత  శివరామకృష్ణ"
(నవంబర్ 27,1920జూన్ 7, 2005)  గారి పుట్టి
న రోజు నేడు..!!

*నూరేళ్ళు కాదు, వెయ్యేళ్ళు గుర్తుండిపోయే 
ప్రజా రచయిత " బొల్లిముంత శివరామకృష్ణ "!!

కొందరు పుడతారు గిడతారు.లోకంమరిచిపోతుం
ది.మరికొందరు పుట్టి చిరకాలం ప్రజలు  గుండెల్లో  'చిరంజీవి'గా నిలిచిపోతారు.అటువంటివారే మన
బొల్లిముంత శివరామకృష్ణ గారు.!!

బొల్లిముంత శివరామకృష్ణ పుట్టి వందేళ్ళు దాటా
యి. రెండేళ్ళ క్రితం తెనాలిలో ఆయన శతజయం
తి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.నూరేళ్ళేమిటి?
 మరో వెయ్యేళ్ళయినా, ప్రజలకు  గుర్తుండిపోయే ప్రజా రచయిత  బొల్లిముంత  శివరామకృష్ణ.....
గారు.!

అభ్యుదయ వాదిగా,ప్రజారచయితగా, ప్రజా
కళాకారుడిగా,హేతువాదిగా,వామపక్షీయుడి
గా తెలుగు సాహితీ లోకంలో నిశ్శబ్ద విప్లవానికి
తెరతీసిన మార్క్సిస్టు గాంధీ ఆయన.!

*జీవితం…సాహిత్యం..!!

గుంటూరు జిల్లా చదలవాడలో అక్కయ్య, మంగమ్మ దంపతులకు 1920,నవంబర్ 27
న జన్మించారు….బొల్లిముంత శివరామకృష్ణ గారు.గుంటూరులోనే హయర్‌ గ్రేడ్ శిక్షణ ను  పూర్తిచేసి, తండ్రి చదలవాడలో ప్రారంభించిన
పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా చేరారు.
అక్కడే...త్రిపురనేని గోపీచంద్ లతో పరిచయం కలిగింది.చిన్నప్పటి నుంచే  ఈయనపై జస్టిస్‌ 
పార్టీ ప్రభావం,త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేవి. 

బొల్లి ముందు తండ్రిగారికి రామస్వామి చౌదరి గారునడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమంతోనూ, జస్టిస్‌ పార్టీతోనూ దగ్గరసంబంధాలుండేవి.
ఆ సంబంధాల ప్రభావం శివరామకృష్ణ గారిపై 
బాగా పడింది.

1938-39   సంవత్సరంలో   గుంటూరులో.....
హయ్యర్‌ గ్రేడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థి ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఆయన చురుగ్గా  పాల్గొనడమూ జరిగింది.

గోపీచంద్‌ కథలు రాసి పత్రికల్లో అచ్చేయిస్తూ ఉండటాన్ని.చూసిన శివరామకృష్ణ గారు  వచ
న రచనలు చేశారు. 1936లో మద్రాసు నుండి వెలువడే ‘చిత్రాంగి’ పత్రికలో తన తొలి కథ ....
‘ఏటొడ్డు’ ప్రచురితమైంది.అప్పుడాయన వయసు పదహారు సంవత్సరాలు.ఆ తర్వాత ఉపాధ్యాయ 
వృత్తిని వదిలి కార్మిక సంఘంలో చేరారు.'చల్లపల్లి 
రాజా'వారి కి వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు.

*పోరాటం  ఊపిరి...
 రచనలు ప్రాణం..!!
 
బొల్లి ముంత వారికి ప్రజాపోరాటాలంటే  ప్రాణం.  మడమతిప్పని ఉద్యమవాది అయిన.ఆ పోరాట అనుభవాలతోనే తొలి రాజకీయ నవల"మృత్యుం
జయులు".  రాశారు. కొంతకాలం' నగారా ' అనే... పత్రిక నడిపారు.కొడవటిగంటికుటుంబరావుగారు
రాసిన 'పిల్లి' అనే కథపై కొడవటిగంటి తిరోగమన 
యాత్ర'  అంటూ ఘాటైనవిమర్శ చే (రా) శారు. 

బెంగాల్ కరువుపై ఓ బుర్రకథను  కూడారాశారు' రైతుబిడ్డ ' హరికథ,సూక్ష్మంలో మోక్షం, అంతరా
త్మ అంత్యక్రియలు, అనే…పాపులర్ కథలూ  రాశా
రు.అంతేకాదు..గయోపాఖ్యానం,రాజకీయ కురు
క్షేత్రం,యే ఎండకాగొడుగు  ధర్మసంస్థాపనార్థాయ,
పత్రికా న్యాయం, క్విట్ కాశ్మీర్, తెలంగాణా స్వతం
త్రఘోష,తదితర నాటికలు కూడా రాశారు. ఇక.... 'రాజకీయ' వంటి పద్య నాటకాలను కూడా రాశారు. .

దొంగ దొరికింది, భలేమంచి చౌకబేరం వంటి రేడి
యో నాటికలు రాశారు. నేటి భారతం పేరుతో మూకీ నాటికను  రాశారు. ప్రజానాట్యమండలి పునరుద్ధరణ సమయంలో బొల్లిముంత శ్రీకాంత్‌
తో కలసి "అందరూ బతకాలి నాటకం" రాశారు. దీన్ని రక్తకన్నీరు నాగభూషణం వందకు పైగా.... ప్రదర్శనలిచ్చారు.

*హత్యా ప్రయత్నం..!!

1955 మధ్యంతర ఎన్నికల సందర్భంగా  రెండు పర్యాయాలు బొల్లిముంత శివరామకృష్ణపైహత్యా
 ప్రయత్నం జరిగింది.అయినా, ఆయన లెక్కచేయ
లేదు.మృత్యుభీతి  లేని కామ్రేడ్ ఆయన..!!

*ఆత్రేయ అసిస్టెంట్ గా..!!

1960లో మనసుకవి ఆత్రేయ దగ్గర అసిస్టెంట్
గా చేరారు.వాగ్దానం,కలసివుంటే కలదుసుఖం, కలిమిలేములు వంటి అనేక చిత్రాలకు సహ రచ
యితగా  వ్యవహరించారు.బి.ఎస్. నారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో... అధిక భాగం 
బొల్లి ముంత వారు  రాసినవే. 

*పత్రికా సంపాదకుడిగా…!!

1968లో విశాలాంధ్ర ప్రారంభించిన ప్రతిభ 
వారపత్రికకి సంపాదకుడయ్యారు. 

*సినీ రచయిత గా..‌!!

దర్శకుడు వి.మధుసూదనరావు చిత్రాలకు ఎన్నిం
టికో సంభాషణలు రాశారు. ఆయన రాసిన దాదా
పు యాభై సినిమాల్లో మనుషులు మారాలి, ప్రజా నాయకుడు వంటి సీరియస్ సినిమాలతో పాటు
శారద,కళ్యాణమంటపం, మూగకు మాటొస్తే, విచి
త్రబంధంవంటి  సెంటిమెంట్ ప్రధానమైన చిత్రాలు కూడా ఉన్నాయి.చిత్రంఏమిటంటే….బొల్లి ముంత 
వారిచే హాస్యం రాయించారు ఉషాకిరణ్ మూవీస్ పతాకం అధినేత రామోజీరావు..అంతేకాదు తన బ్యానర్ లో ఓ హాస్య సినిమాదర్శకత్వ బాధ్యత
లు కూడాఅప్పగించారు రామోజీరావు

*మాటలు తూటాలు..!!

ఆత్రేయగారు స్వయంగా నిర్మించిదర్శకత్వంవహిం
చిన ‘వాగ్దానం’కు బొల్లిముంత వారే తొలి  సారిగా
మాటలు రాశారు.ఆ తర్వాత ‘తిరుపతమ్మకథ’కు
మాటలురాశారు.వి.మధుసూదనరావుదర్శకత్వం
లో వచ్చిన శారద,శోభన్ బాబుల " మనుషులు మారాలి"చిత్రానికి బొల్లి ముంత రాసిన మాటలు గొప్పగా పేలాయి. ఆయన మాటల తూటాల కార
ణంగానే ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది.
జాతీయ అవార్డులుదక్కాయి.శారదకు ఊర్వశి అవార్డు వచ్చింది..!'కాలం మారింది’ సినిమాకు గాను రచయిత గా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు దక్కింది.!!

*కథారచయిత గా..

ఆ రోజుల్లోనే ఆయన ‘  దేశం  ఏమయ్యేట్టు?’,
'వ్యక్తి స్వాతంత్య్రం’ వంటి కథలు రాసి ప్రచు
రించారు. కమ్యూనిస్టుపార్టీ  కార్యకర్తగా .......
ఆయన తన అనుభవంలోకి వచ్చిన విషయా
ల్ని కథలుగా మలిచారు. ఎప్పుడు కూడా...  పనికట్టుకుని కథలు రాయలేదు. వ్యవసాయ కూలీలు, ఇతరనిరుపేదలంటే వల్లమాలిన ప్రాణం. అభిమానం.!

ఆయన రచనల్లో ఎక్కువగా కమ్యూనిస్టు భావ
జాలాన్ని ప్రతిబింబిస్తూ రాసినవే. ఆ రోజుల్లో చదలవాడ పిచ్చయ్య చౌదరి అభ్యుదయ రచ
యితల సంఘం (అరసం) నాయకుడిగా వుండే
వారు.. ఆయన ఇటు త్రిపురనేని రామస్వామి చౌదరి, అటు కృష్ణ శాస్ర్తి లాంటి వారందరినీ కలు
పుకుని అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ముందు
కు నడిపారు. చదలవాడ పిచ్చయ్య చౌదరి ఆధ్వ
ర్యంలోతెనాలిలో 'అరసం'  తొలి మహాసభ
(1943 ) జరిగింది. 'తాపీ ధర్మారావు గారు ',
ఆ సభకు అధ్యక్షత వహించారు.అప్పటికి....
బొల్లిముంత శివరామకృష్ణ గారి వయసుఇరవై మూడేళ్ళయినా, ఆ మహాసభ నిర్వహణకు కార్యకర్తగా పనిచేశారు. 

*తెలంగాణ పోరుబాట…!!

బొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీ
నామా చేసి, పూర్తి సమయం కమ్యూనిస్టు పార్టీకి అంకితమయ్యారు.పార్టీ పనులమీద తిరుగుతూ మునగాల పరగణాలోని జగ్గయ్య పేటకు వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది. అక్కడే తెలంగాణ పోరాటం గూర్చి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకొని  వాటి
 ప్రేరణతో ఇరవై ఏడేళ్ళ వయసులోనే ‘మృత్యుం
జయులు’  నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ... నాయకత్వాన1946-51మధ్య అర్ధ దశాబ్దకాలం
పాటు తెలంగాణ సాయుధ  రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు.

సాయుధులై దోపిడీ వర్గాల మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయిత
లు,కళాకారులు ఎంతోమందిభాగస్వాములయ్యా
రు. యాదగిరి, సుద్దాల హనుమంతు, తిరునగరి రామాంజనేయులు, నాజర్‌,సుంకర, వాసిరెడ్డి,
కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగి
నేని వంటి కవుల అక్షరాలతో ఆయన  కూడా...
జత కలిశారు.ముందు నిలిచారు.తెలంగాణ పోరాటం ప్రారంభమైన ఒక సంవత్సరానికి బొల్లి
ముంత ‘మృత్యుంజయులు’ నవల 1947 అక్టో
బరు 25  న విడుదలైంది. 

ఒకప్పటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్రులపై చూపు
తోన్నవివక్షనితరిమెల నాగిరెడ్డి ద్వారా పలికించిన 
విప్లవ విపంచి …(రచయిత.) బొల్లి ముంత శివ
రామకృష్ణ .1988 లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారి
చే కొండేపూడి సాహితీ సత్కారాన్ని అందుకున్నా
రు. జూన్ 7, 2005 న ఆయన కాలం చేశారు..!!

*బొల్లి ముంత వారికి ' లాల్ సలామ్' …!!

(చిత్రం... మొహమ్మద్ గౌస్.హైదరాబాద్.)

*ఎ.రజాహుస్సేన్…

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...