మేరుగ జయరావు కన్నుమూత

మేరుగ జయరావు కన్నుమూత
తెనాలి: వైద్య ఆరోగ్య శాఖ విశ్రాంత ఉద్యోగి, మాజీ కౌన్సిలర్ (బాపట్ల), కార్మిక సంఘ నేత, అభ్యుదయవాది  మేరుగ జయరావు ( 89)ఆదివారం రాత్రి అనారోగ్యంతో గుంటూరు ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆయనకు జయకరుణ, జయలలిత, జయశ్రీ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్థానిక చిన్నరావూరు తోటలోని ఆయన స్వగృహంలో జయరావు భౌతిక కాయాన్ని ఉంచారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు జయరావుకు ఘన నివాళులు అర్పించారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం నుంచి ఇప్పించడంలో ఆయన కృషి ఉందన్నారు. చిన్నారావూరు తోట లోని  మదర్ థెరిస్సా నగర్ ఏర్పడటానికి జయరావు ముఖ్యులని కొనియాడారు. పేదల పక్షపాతిగా పలు ఉద్యమాలు చేశారని గుర్తుచేసుకున్నారు.