చిత్రకారుడు తిమ్మిరి రవీంద్ర కు గౌరవ డాక్టరేట్ ప్రధానం

చిత్రకారుడు తిమ్మిరి రవీంద్ర కు గౌరవ డాక్టరేట్ ప్రధానం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఒంగోలు నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు తిమ్మిరి రవీంద్ర కు గత 30 సంవత్సరాలుగా చిత్రకళా రంగంలో చేసిన సేవలు మరియు సాధించిన విజయాలకు గాను ఫైన్ ఆర్ట్స్ విభాగంలో అమెరికాకు చెందిన డే స్ప్రింగ్  యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను బెంగళూరు లో హెబ్బల్  లోని ఇండియన్ సొసైటీ హాల్ లో జరిగిన డే స్ప్రింగ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ సభలో తిమ్మిరి రవీంద్ర కు గౌరవ డాక్టరేట్ దృవీకరణ పత్రము మరియు బంగారు పథకాన్ని అమెరికాకు చెందిన Mr. Dylen guest, Dr. Amos James, DCU, ఇండియా రిప్రజెంటేటివ్. Dr. రవికుమార్ బెంగళూరుDCU డైరెక్టర్,Dr. వెంకటేష్ NGO చైర్మన్ బెంగళూరు. వారు అందజేసి చిత్రకళ రంగాన్ని మరింత అభివృద్ధి పదంలో నడపాలని అభినందించారు. చిత్రకారుడు తిమ్మిరి రవీంద్ర మాట్లాడుతూ  డేస్ప్రింగ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ విజయాలకు  నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మా చిత్రకారులు, కుటుంబ సభ్యులు,చిత్రకారుడు వై. యస్ బ్రహ్మం, నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ కార్యదర్శి టి. భాను చందర్, డైమండ్ సెక్యూరిటీ ఎండీ. దారా బాలకోటేశ్వరరావు, బత్తుల మంజువాణి, తునుగుంట నాగమణి, రత్నం,నా స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.