బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ

బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, తెనాలి:
ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా, నవలా, కధా, రచయితగా అభ్యదయ సినీ రచయితగా, పత్రికా సంపాదకునిగా, సంగీత దర్శకునిగా, నటునిగా, స్త్రీ పాత్ర ధారిగా బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ అని అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సంపాదకులు గోలి సీతారామయ్య చెప్పారు. తెనాలి గాంధీనగర్ బొల్లిముంత శివరామకృష్ణ పౌండేషన్ హాలులో ఆదివారం బొల్లిముంత ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఇస్కఫ్ సంయుక్త ఆధ్వర్యంలో శివరామకృష్ణ 102 జయంతి సభలో ఆయన మాట్లాడారు. సభకు ఉపాధ్యాయ నాయకులు కనవర్తి బెనార్ అధ్యక్షత వహించారు. నీనారామయ్య తన ప్రసంగంలో తెలుగునేతలపై అమూల్యమైన సాహిత్యాన్ని సృష్టించారన్నారు. తెలంగాణా నైజాం, నవాబు పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు సేనానిగా బాగస్వాములై అచట వీడిత ప్రజల కష్టాలను కడగంట్లను అద్భుతంగా చిత్రీకరిస్తూ మృత్యుం జయలు, నవల రాశారన్నారు. అనేక కధలు నవలలు రాస్తూనే ప్రతిభ, ప్రగతి, నగరం ప్రజాపక్షం పత్రికలకు సంపాదకత్వం వహించారన్నారు. చలన చిత్ర రంగంలో యాబై చిత్రాలకు పైగా సంభాషనలు రాసి ప్రసిద్ధి పొందారన్నారు. జీవితాంతం కమ్యూనిస్టుగా జీవించారన్నారు. 1967లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకు చల్లపల్లి రాజాతో పోటీ చేశారన్నారు. సభా ప్రారంభంగా ప్రజానాట్య మండలి నాయకులు జగన్మోహనరావు, శ్రీదేవి, నీలాంబ్రం, బెజ్జంకి నాగమణి, బాగవతారిణిలు విప్లవ గేయాలను ఆలపించారు. సభలో నగరాజకుమారి, ఎఐటియుసి నాయకులు ఎస్. గురుబ్రహ్మం, మునిపల్లి శ్రీకాంత్, జె.వి. రాంబాబు, ప్రొఫెసర్ శేషిరెడ్డి, వెనిగళ్ళ ప్రసాదు, వెనిగళ్ళ వెంకటేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, పాతూరి సుబ్రహ్మణ్యం, దర్శకుడు కనపర్తి రత్నాకర్, వసంతయామినిలు పాల్గొన్నారు. యం.వి.రఘునాధరావు స్వాగతం పలికారు. చిరంజీవి గగన శ్రీ కూచిపూడి సాంప్రదాయ నృత్యం చేసి అలరించింది.