కష్టకాలంలోను మానవాళికి వ్యవ‘‘సాయం

కష్టకాలంలోను మానవాళికి వ్యవ‘‘సాయం’’


 -  రాజస్థాన్‌లోని కోట అగ్రికల్చర్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్‌ డీసీ జోషి

 మీ దగ్గరికే ఇండస్ట్రీలు : మైసూర్‌లోని సీఎస్‌ఐఆర్‌–సీఎఫ్‌టీఆర్‌ఐ చీఫ్‌ సైంటిస్ట్, ఫుడ్‌ ప్యాకెజింగ్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ రాజేశ్వర్‌ ఎస్‌ మాచే

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌

టాలెంట్ ఎక్స్ ప్రెస్:
కరోనా కష్టకాలంలో మానవాళికి ఆహారాన్ని అందించడంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన ఘనత వ్యవసాయ రంగానికే దక్కుతుందని రాజస్థాన్‌లోని కోట అగ్రికల్చర్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్‌ డీసీ జోషి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలోని ఫుడ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ఇన్నోవేటివ్‌ ఫుడ్‌ సిస్టమ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ ఫర్‌ సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ అగ్రో–ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సెక్టార్‌’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజస్థాన్‌లోని కోట అగ్రికల్చర్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్‌ డీసీ జోషి మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లలలో మార్పులు విపరీతంగా చోటుచేసుకున్నాయన్నారు. గతంలో లాగ ఆహారాన్ని దుర్వినియోగం చేయకుండా అవసరమైన మేరకు మాత్రమే వినియోగిస్తున్నారన్నారు. వీటన్నింటికి మించి ప్రజలందరూ సంప్రదాయ ఆహారపు అలవాట్లను అవలంబించడంతో పాటు ఇమ్యూనిటీ పెంచే పోషక పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నారని వెల్లడించారు.

మీ దగ్గరికే ఇండస్ట్రీలు : మైసూర్‌లోని సీఎస్‌ఐఆర్‌–సీఎఫ్‌టీఆర్‌ఐ చీఫ్‌ సైంటిస్ట్, ఫుడ్‌ ప్యాకెజింగ్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ రాజేశ్వర్‌ ఎస్‌ మాచే

ప్రస్తుతం ఆహార రంగంలో ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు గుర్తించి వాటికి పరిష్కారాలను కనుగొన్నటైతే.... ఇండస్ట్రీలే మీ దగ్గరికి వస్తాయని మైసూర్‌లోని సీఎస్‌ఐఆర్‌–సీఎఫ్‌టీఆర్‌ఐ చీఫ్‌ సైంటిస్ట్, ఫుడ్‌ ప్యాకెజింగ్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ రాజేశ్వర్‌ ఎస్‌ మాచే అన్నారు. అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌కు గౌరవ అతిథిగా హాజరైన రాజేశ్వర్‌ మాట్లాడుతూ విద్యార్థులను ఇన్నోవేషన్స్, టెక్నాలజీ, ఇండస్ట్రీ రంగాలలో ఎక్కువగా తర్ఫీదు ఇవ్వాలని అధ్యాపకులకు సూచించారు. ఏయే రంగాలలో అయితే విద్యార్థులు ఆసక్తి చూపుతారో వాటివైపే వారిని ప్రోత్సహించాలన్నారు. అనంతరం అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌కు సంబంధించిన సావనీర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.