సూపర్ స్టార్ కృష్ణ మృతితెనాలి కళారంగానికి తీరనిలోటు

సూపర్ స్టార్ కృష్ణ మృతి
తెనాలి కళారంగానికి తీరనిలోటు
- దర్శకుడు రత్నాకర్

తెనాలి: డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ రంగంతో పాటు ప్రత్యేకంగా తెనాలి కళా రంగానికి తీరని లోటని దర్శకుడు రత్నాకర్ కనపర్తి అన్నారు. పలుసందర్భాల్లో కృష్ణను కలసిన ఆయన కృష్ణ తో అనుబంధం ఉందన్నారు. తెనాలి వాసులు గర్వంగా మా తెనాలి  వాసి కృష్ణ అని చెప్పుకుంటారని నేడు ఆయన లేని లోటు తెనాలి ప్రాంత వాసులకు తీర్చలేనిదన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు రత్నాకర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.