ఈనెల 12 నుంచి రత్నాకర్ దర్శకత్వంలో వీడియో ఆల్బమ్ షూటింగ్ ప్రారంభం

ఈనెల 12 నుంచి రత్నాకర్ దర్శకత్వంలో వీడియో ఆల్బమ్ షూటింగ్ ప్రారంభం

తెనాలి: దర్శకుడు రత్నాకర్ కనపర్తి దర్శకత్వం లో నా నావలో అనే క్రిస్మస్ ప్రత్యేక వీడియో ఆల్బమ్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆల్బమ్ నిర్మాణ సంస్థ జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ ఆధ్వర్యం లో స్థానిక సరళనగరలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నా నావలో ఆల్బలం సంభందించిన ప్రచార పోస్టర్స్ ను అమిరినేని వెంకట్ ప్రసాద్ ఆవిష్కరించారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ గతం లో జోవెన్ బ్యానర్ లో, నీల కోటేశ్వరరావు నిర్మాతగా హృదయతార వీడియో ఆల్బలం ను రూపొందించామని. రానున్న క్రిస్మస్ సందర్భంగా మరో ఆల్బమ్ ''నా నావలో ''అనే పేరుతో రూపొందిస్తున్నామన్నారు.ప్రొఫెసర్ సుధాకర్ రచించిన పాటకు శ్రీపతి రాముడు సంగీత దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ గానం చేశారన్నారు.
ఇందులో మాస్టర్ జోయల్ సుధాకర్ తో పాటు స్థానిక కళా కారులతో షూటింగ్ జరుగుతుందన్నారు. అమ్మ సుధీర్ గోగినేని, కొండ్రు కిరణ్ లు నృత్య దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. చీరాల, నిజాంపట్నం సముద్ర తీరం లో షూటింగ్ ఈ నెల 12 నుంచి జరుగుతుందన్నారు. సమావేశం లో డి.ఓ.పి లు కొమరాబత్తుని నాగరాజు, దేవరపల్లి మధు, ప్రొడక్షన్ ఇంచార్జ్ మధుకర్, లైన్ ప్రొడ్యూసర్ మునిపల్లి శ్రీకాంత్, కో డైరెక్టర్ ఎస్.ఎస్.వి. శేఖర్, తదితరులు పాల్గొన్నారు.