విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకునికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకునికి పీహెచ్‌డీ

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈఈఈ  డిపార్ట్‌మెంట్‌ విభాగంకు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మాచవరపు సుమన్‌కు కాకినాడలోని  జేఎన్‌టీయూ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ కంబైన్డ్‌ ఆపరేషన్‌ ఆఫ్‌ పవర్‌ సిస్టమ్‌ స్టెబిలైజర్‌ అండ్‌ స్టాటిక్‌ వార్‌ కంపేన్సేటర్‌ ఆన్‌ మల్టీ మెషీన్‌ పవర్‌ సిస్టమ్‌ యూజింగ్‌ హ్యూరియాస్టిక్‌ మెథడ్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేసారు. ఈయనకు ఒంగోలులోని క్యూఐఎస్‌ సెట్‌లోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ ఎం.వేణుగోపాల రావు గైడ్‌గాను, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ పీవీ రమణా రావు కో–గైడ్‌గాను వ్యవహరించారని పేర్కొన్నాడు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 6 పేపర్లు ప్రముఖ ఇంటర్నేషనల్‌ జర్నల్స్‌లో ప్రచురించారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టాపొందిన మాచవరపు సుమన్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.