విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకునకు పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకునకు పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పాడ్య భరత్‌ సింగ్‌కు  కర్ణాటకలోని మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఏహెచ్‌ఈ) పీహెచ్‌డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం గురువారం తెలిపింది. ‘‘ ప్రిపరేషన్‌ అండ్‌ ఎవాల్యూషన్‌ ఆఫ్‌ మల్టిఫంక్షనల్‌ నానోపర్టికులేట్‌ టాపికల్‌ ఫార్ములేషన్స్‌ ఫర్‌ ద ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ స్కిన్‌ క్యాన్సర్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేసింది. ఈయనకు మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఏహెచ్‌ఈ) విద్యాసంస్థలోని ఫార్మాస్యూటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీనివాస్‌ ముతలిక్‌  గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. ఈయన తన పరిశోధనలో 2 ప్రముఖ ఇంటర్నేషనల్‌ పేపర్లు, 2 బుక్‌ చాప్టర్లు ప్రచురించారని వెల్లడించింది. పీహెచ్‌డీ పట్టాపొందిన పాడ్య భరత్‌ సింగ్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.