విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్




విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్

*రూ. 184.12 కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఎంట్రీ*
*దశల వారీగా పెట్టుబడులను విస్తరించనున్న అమెజాన్*
*అమెజాన్ ఏపీ ఎంట్రీపై సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ట్వీట్*

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఏపీలో మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఐటీ హబ్ గా మారుతన్న విశాఖలో అమెజాన్ సంస్థ తన డెవలప్ మెంట్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఫెసిలిటీ సెంటర్ కోసం విశాఖలో రూ. 184.12 కోట్ల పెట్టుబడిని తేనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ పెట్టుబడుల కోసం ప్రాథమిక నిర్ణయం పూర్తై సాఫ్టవేర్ టెక్నాలజీ పార్స్క్ ఆఫ్ ఇండియాకు ధరఖాస్తు చేసుకుంది. నూతన సంవత్సరంలో నూతన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. ఈ మేరకు అమెజాన్ సంస్థ పెట్టుబడులపై సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా స్వయంగా ట్వీట్ చేసింది. డెవలప్ మెంట్ సెంటర్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుతో ఐటీ ఉద్యోగాలతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా, కండ్యూయెంట్, మిరాకిల్ సిటీ, పాత్ర ఇండియా, డబ.