విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకురాలికి పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగంకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రామిశెట్టి వీ నాగశైలజకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ మీడియేటింగ్‌ అఫెక్ట్‌ ఆఫ్‌ టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆన్‌ ఎంప్లాయి అగిలిటీ అండ్‌ ఇన్నోవేషన్స్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారని తెలియజేసారు. ఈమెకు ఏఎన్‌యూలోని హెచ్‌ఆర్‌ఎం అండ్‌ ఎంబీఏ( హెచ్‌ఏ) విభాగాధిపతి డాక్టర్‌ వీ.తులసీ దాస్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నాడు. పీహెచ్‌డీ పట్టా పొందిన రామిశెట్టి వీ నాగశైలజను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.