యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలి

యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలి

- కిరణ్ చికెన్స్ ప్రారంభోత్సవం లో దర్శకుడు రత్నాకర్

తెనాలి: చదువుకున్న యువత కేవలం ఉద్యోగాల పైనే కాకుండా తమకున్న నైపుణ్యాలను వినియోగించుకుని స్వయం ఉపాధి కల్పించుకోవాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దర్శకుడు, జర్నలిస్ట్ సంఘనేత కనపర్తి రత్నాకర్ అన్నారు. స్థానిక తెనాలి చినరావూరు తోటలో  సోమవారం ఉదయం యువ వ్యాపారవేత్త ఎన్. కిరణ్ నూతనంగా ఏర్పాటు చేసిన కిరణ్ చికెన్స్ ప్రారంభోత్సవం లో రత్నాకర్ ముఖ్య అతిధిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ కళల రాజధాని తెనాలి అని అందులో చినరావూరు తోట మాంసాహారానికి పెట్టింది పేరుని అన్నారు. కేవలం వ్యాపారమే లక్ష్యం గా కాకుండా ప్రజలకు నాణ్యమైన మాంసాహారాలను అందుబాటు ధరల్లో అమ్మకాలు చేయాలన్నారు. కార్యక్రమం లో   బిషప్ ఎన్. సువర్ణరాజు, జర్నలిస్ట్ నాయకులు ఎం. పున్నయ్య, కె. బన్నీ, జి. సంజీవరావు, ఎన్. రమేష్, బి. అశోక్ తదితరులు పాల్గొన్నారు.