Skip to main content

తక్షణమే జర్నలిస్టులకు రైల్వే పాస్ ప్రయాణంలో రాయితీ పునరుద్ధరించాలి

తక్షణమే జర్నలిస్టులకు రైల్వే పాస్ ప్రయాణంలో రాయితీ పునరుద్ధరించాలి.
సౌత్ సెంట్రల్ రైల్వే జి.ఎం. అరుణ్ కుమార్ జైన్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ వినతి.
   
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 వర్కింగ్ జర్నలిస్టులకు రైల్వే ప్రయాణానికి సంబంధించి రైల్వే పాస్ లకు రాయితీ తక్షణమే అమలు దిశగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జి.ఎం. అరుణ్ కుమార్ జైన్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ కర్నూలు జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టు రైల్వే ప్రయాణ సమస్యలతో కూడిన వినతిని అందించారు.ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు శివ కుమార్  ప్రధాన కార్యదర్శి నాగేంద్ర లు మాట్లాడుతూ కరోనా కోవిడ్ తరువాత రైల్వే పాస్ రాయితీ తొలగించారని జర్నలిస్టులు వృత్తి రీత్యా సమాచారం సేకరణకు వేసులుబాటుగా ఉన్న రాయితీ ని తీసివేశారన్నారు.అందుకుగాను వర్కింగ్ జర్నలిస్ట్ లు రైల్వే ప్రయాణాల్లో తిరగలేని పరిస్థితి ఉందన్నారు.జర్నలిస్టుల రైల్వే రాయితీ ని తిరిగి పునరుద్ధరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కోరుతుందన్నారు.తమరు వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితి గుర్తించి అందుకు అనుగుణంగా రైల్వే ప్రయాణాల్లో రాయితీని వెంటనే అమలు చేయగలరని కోరుకుంటున్నామన్నారు.ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టులు కోవిడ్ లాంటి భయంకర పరిస్థితుల్లో కూడా పని చేశారు. చాలా మంది జర్నలిస్టులు కరోన కారణంగా మరణించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను ఆదుకోవడం లో విఫలమయ్యారు. కనీసం రైల్వే ప్రయాణాల్లో అయిన రాయితీ అమలు చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.దీనికి రైల్వే జి.ఎం అరుణ్ కుమార్ జైన్ స్పందించి మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మా నుండి ఈ వినతిని కేంద్రానికి పంపుతామని కచ్చితంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు విద్య సాగర్,నగర సహాయ కార్యదర్శి చెన్నయ్య ,నగర నాయకులు విజయ్ కుమార్,రవి బాబు,అసిఫ్,శ్రీనివాసులు,యూసుఫ్,తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పై జి.ఎం. కు ఇచ్చిన డిమాండ్స్.
1. ప్రెస్ కరెస్పాండెన్స్ రైల్వే పాస్ రాయితీని కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో నిలిపివేశారు. ఇప్పుడు రైళ్ళన్ని యధావిధిగా నడుస్తున్నప్పటికీ తిరిగి పునరుద్ధరించలేదు. వెంటనే అనుమతించాలి.
2. ప్రెస్ కరెస్పాండెన్స్ రైల్వే పాస్ కలిగిన విలేకరులకు ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో సీటింగ్ వరకు ఉచిత ప్రయాణం కల్పించాలి. రైల్వే జారీ చేసిన గుర్తింపు కార్డు చూపి ప్రయాణించే వీలు కల్పించాలి.
3. స్లీపర్ క్లాస్, ఆ పై తరగతుల్లో ఇప్పుడున్న 50 శాతం రాయితీని 75 శాతానికి పెంచాలి.
4. గరీబ్ రథ్ రైళ్లలో, తత్కాల్ టికెట్స్ పై రాయితీ వర్తింపజేయాలి.
5. రిజర్వేషన్లలో జర్నలిస్ట్ కోట ఏర్పాటు చేయాలి.
6. స్పెషల్ రైళ్లలో జర్నలిస్టులకు టికెట్లపై రాయితీ కల్పించాలి . ద్వారా టికెట్లు
7. ఆన్ లైన్, మొబైల్ యాప్ పొందే వాళ్లకు జర్నలిస్టులు రాయితీ పొందేందుకు ప్రెస్ కరెస్పాండెన్స్ కాంషక్షన్ అప్షన్ పెట్టాలి.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...