చందూస్ సిల్వర్ కప్ క్రికెట్ చాంఫియన్స్‌గా ‘విజ్ఞాన్ ’ రన్నర్స్‌గా ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల (భీమవరం) గుంటూరులోని జేకేసీ కళాశాల ఆధ్వర్యంలో అధ్యాపకుల కోసం నిర్వహించిన 26వ చందూస్ సిల్వర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ నిలిచింది. స్థానిక జేకేసీ కళాశాలలోని క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ జట్టు భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు మీద 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌కేఆర్ బ్యాట్స్‌మెన్ శ్రీహరి వర్మ మంతెన (41) పరుగులతో రాణించగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ బౌలర్లలో మాదినేని లోకేష్, పీ.కిషోర్ ఇద్దరూ రెండేసి వికెట్లు తీసి తక్కువ పరుగులకే కట్టడి చేసారు. అనంతరం 120 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విజ్ఞాన్స్ యూనివర్సిటీ కేవలం 15.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు సాధించి 5 వికెట్లతో విజయదుందుభి మోగించింది. విజ్ఞాన్స్ య...