విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి జాతీయస్థాయి పేటెంట్‌

విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి జాతీయస్థాయి పేటెంట్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సెన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని ఇంగ్లీష్‌  డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ గోమఠం మోహనాచార్యులకు జాతీయస్థాయి పేటెంట్‌ మంజూరైందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం బుధవారం తెలియజేసింది. ‘‘ లాంగ్‌–టర్మ్‌ ఎడ్యుకేషనల్‌ ప్రాక్టీసెస్‌ ఇన్‌ ఇండియన్‌ క్లాస్‌రూమ్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను ప్రముఖ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీస్‌ ఇండియన్‌ అథారిటీ పేటెంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందని వెల్లడించింది. విజన్‌ 2030 ఆధారంగా నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేదిశలో తరగతి గదిలో నిర్వర్తించాల్సిన భాష పాఠ్య ప్రణాళికలు, ఆచరణాత్మక తీరు తెన్నుల స్వరూప స్వభావాలను వివరించడం వలన పేటెంట్‌ లభించిందని తెలియజేసింది. ఈ పేటెంట్‌ రూపకల్పనలో జీ.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్, విద్యా జ్యోతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కళాశాలలోని అధ్యాపకులతో సంయుక్తంగా ఇండియన్‌ పేటెంట్‌ను పొందారని పేర్కొంది. జాతీయస్థాయి పేటెంట్‌ను పొందిన ప్రొఫెసర్‌ గోమఠం మోహనాచార్యులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.