ఫార్మా క్రికెట్‌ చాంఫియన్స్‌ విజేత ‘నిప్స్‌

ఫార్మా క్రికెట్‌ చాంఫియన్స్‌ విజేత ‘నిప్స్‌

  రన్నర్స్‌గా విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల

  విజ్ఞాన్‌ ఫార్మసీలో వైభవంగా ముగిసిన జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలు
‘ఫార్మా క్రికెట్‌ చాంపియన్స్‌ టౌర్నమెంట్‌– 2కే23’’ జాతీయ స్థాయి క్రికెట్‌ ట్రోఫీని నిప్స్‌ ఫార్మసీ కళాశాల జట్టు గెలుపొందింది. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో గురువారం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ‘‘ఫార్మా క్రికెట్‌ చాంపియన్స్‌ టౌర్నమెంట్‌– 2కే23’’ జాతీయ స్థాయి పోటీల క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను  విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక ఉల్లాసానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు తరచూ క్రీడల్లో పాల్గొంటే ఎనలేని ప్రయోజనాలు సొంతమవుతాయన్నారు. విద్యార్థులు ఓటమినే విజయానికి తొలి మెట్టుగా మలుచుకోవాలన్నారు. విద్యార్థులు క్రీడల్లో పోటీతత్వం కలిగి ఉండాలని, బలమైన దేశం కావాలంటే అది ఒక క్రీడలతోనే సాధ్యమని తెలిపారు. అనంతరం గెలుపొందిన జట్ల సభ్యులకు ట్రోఫీలు అందాంచాడు. టోర్నీలో ఉత్తమంగా రాణించిన క్రీడాకారులను అభినందించి ప్రోత్సాహక బహుమతులు అందించాడు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

స్కోరు వివరాలు
టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో నిప్స్‌ ఫార్మసీ కళాశాల జట్టు 9.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 117 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో నిప్స్‌ ఫార్మసీ కళాశాల ఆటగాడు నవీన్‌ 57 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

టోర్నీలో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ : సందీప్‌ (విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల)
టోర్నీలో బెస్ట్‌ బౌలర్‌ : ప్రశాంత్‌ ( విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల)
టోర్నీలో బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ : ప్రశాంత్‌ ( విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల)