విజ్ఞాన్స్‌ లారా విద్యార్థులకు బంగారు పతకాలు

విజ్ఞాన్స్‌ లారా విద్యార్థులకు బంగారు పతకాలు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు మూడు బంగారు పతకాలు లభించాయని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జేఎన్‌టీయూ కాకినాడ విడుదల చేసిన 2018–22 బ్యాచ్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలలో తమ విద్యార్థులు వివిధ విభాగాలలో మూడు బంగారు పతకాలు సాధించారని వెల్లడించారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన గొంటు యశ్వంత్‌ రెడ్డి అనే విద్యార్థి 9.17 సీజీపీఏతో టాపర్స్‌ విభాగంలో ఒక బంగారు పతకం, ప్రొఫెసర్‌. అల్లం అప్పారావు గోల్డ్‌ మెడల్‌ విభాగంలో మరొక  బంగారు పతకముతో మొత్తం రెండు బంగారు పతకాలు సాధించారని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో దేవరపాటి రాజ్యలక్ష్మి అనే విద్యార్థి 9.12 సీజీపీఏతో ఒక బంగారు పతకము సాధించందని తెలియజేసారు. విద్యార్థులు ఈ బంగారు పతకాలను జేఎన్‌టీయూ– కాకినాడ నిర్వహించబోయే 9వ స్నాతకోత్సవంలో అందుకోనున్నారని తెలిపారు. క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించటంతో పాటుగా పటిష్టమైన కౌన్సిలింగ్‌ విధానం వలన విద్యార్థులు ఈ ఘనత  సాధించారని తెలియజేసారు. బంగారు పతకాలను సాదించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఆయా విభాగాల డీన్లు, విభాగాదిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.