రిపబ్లిక్‌ డే పరేడ్‌కు విజ్ఞాన్స్‌ ఎన్‌సీసీ విద్యార్థుల ఎంపిక

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు విజ్ఞాన్స్‌ ఎన్‌సీసీ విద్యార్థుల ఎంపిక

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన ఇద్దరు విద్యార్థులు చాగం రాఘవి (బీబీఏ ఎల్‌ఎల్‌బీ – రెండో సంవత్సరం), షేక్‌ అస్విల్‌ అహ్మద్‌ (బీసీఏ – మూడో సంవత్సరం)లు ఈ నెల 26న న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎన్‌సీసీ విభాగంలో ఎంపికయ్యారని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం బుధవారం తెలియజేసింది. 26న జరిగే రిపబ్లిక్‌ డే కవాత్‌ ప్రోగ్రాంలో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రధానమంత్రి ర్యాలీతో పాటు, ఫ్లాగ్‌ ఏరియా కాంపిటీషన్‌ అనే రెండు విభాగాలలో పాల్గొనడానికి ఎంపికవడం గర్వకారణమని తెలియజేసింది. రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఏఎన్‌ఓ శివకోటేశ్వరరావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు అభినందించారు.