నూతన ఓటర్ల నమోదులో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఫస్ట్‌

నూతన ఓటర్ల నమోదులో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఫస్ట్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని విద్యార్థులు నూతన ఓటర్ల నమోదులో మొదటి స్థానంలో నిలిచారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, గుంటూరు రేంజి ఐజీ త్రివిక్రమవర్మ, జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారిల చేతుల మీదుగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌ అఫైర్స్‌ ప్రతినిధి డాక్టర్‌ పలుకూరి విజయ్‌బాబు ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు. ఇటీవల యూనివర్సిటీలో 13వ నేషనల్‌ ఓటర్స్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన స్వీప్‌ కార్యక్రమంలో యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్నందుకు ఈ బహుమతి లభించింది. అంతేకాకుండా యూనివర్సిటీలో జరిగిన స్వీప్‌ కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేసిన 19 మంది విద్యార్థులను నూతన ఓటర్ల నమోదుకై స్టూడెంట్‌ అంబాసిడర్స్‌గా గుర్తించి ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికలను అందజేసారు. నూతన ఓటర్ల నమోదులో మొదటి స్థానంలో నిలవడంతో పాటు, అంబాసిడర్లుగా నిలిచిన 19 మంది విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర లావు రత్తయ్య, వీసీ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.