ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లోకి విజ్ఞాన్‌ ఫార్మసీ అధ్యాపకురాలు

ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లోకి విజ్ఞాన్‌ ఫార్మసీ అధ్యాపకురాలు

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో అధ్యాపకురాలైన ప్రొఫెసర్‌ పులిపాటి సౌజన్య ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో నామినేటెడ్‌ మెంబర్‌గా ఎంపికయ్యిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ ఔషధ రంగాన్ని పరీక్షించి, పరిరక్షించే భారత ఫార్మసీ కౌన్సిల్‌ అనుసంధానంగా నడిచే ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ విభాగంలో సభ్యులుగా డాక్టర్‌ పులిపాటి సౌజన్యని నామినేటెడ్‌ మెంబర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారని తెలియజేసారు. ఆమె 16 ఏళ్లుగా విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలలో అధ్యాపకురాలిగా సేవలందిస్తున్నారని కొనియాడారు. ఫార్మసీ విద్యకు ఆమె పరిశోధనలతో పాటు ప్రచురించిన మ్యాగజైన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ పదవిలో 5 సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం ఇచ్చిందన్నారు. నామినేటెడ్‌ మెంబర్‌గా ఎంపికైన  పులిపాటి సౌజన్యను ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.