Skip to main content

Posts

Showing posts from February, 2023

దేశాన్ని శక్తివంతం చేయాలంటే యువశక్తితోనే సాధ్యం

దేశాన్ని శక్తివంతం చేయాలంటే యువశక్తితోనే సాధ్యం - చెన్నైలోని ప్రొపెల్లెర్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ సీఈవో, జఫీ రోబోట్స్‌ కో–ఫౌండర్‌ ఆషిక్‌ రహమాన్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: దేశాన్ని అభివృద్ధితో పాటు శక్తివంతంగా తయారుచేయాలంటే యువశక్తితోనే సాధ్యమని చెన్నైలోని ప్రొపెల్లెర్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ సీఈవో, జఫీ రోబోట్స్‌ కో–ఫౌండర్‌  ఆషిక్‌ రహమాన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసెల్‌ ఆధ్వర్యంలో ‘‘ ఇట్స్‌ మై స్టోరీ’’ అనే ఇతివృత్తంతో సోమవారం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ఆన్‌లైన్‌లో ముఖ్య అతిథిగా హాజరైన చెన్నైలోని ప్రొపెల్లెర్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ సీఈవో ఆషిక్‌ రహమాన్‌ మాట్లాడుతూ కోవిడ్‌–19 మొదటి వేవ్‌ సమయంలో కరోనా బాధితులకు సేవలందించేందుకు 100 రోబోలను తయారుచేసి తమిళనాడు ప్రభుత్వానికి అందజేసానని తెలియజేసారు. వీటితో పాటు గడిచిన 6 సంవత్సరాల కాలంలో 250కి పైగా విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులకు రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్, డ్రోన్స్, మొబైల్‌ అప్లికేషన్స్, ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ...

సఖీ! ప్రేమ చకుముఖీ

శీర్షిక:   సఖీ!  ప్రేమ చకుముఖీ ! ************************ నువ్వు గులాబీల   పెదవులతో నవ్వుతావు! నువ్వు పువ్వు లాంటి ముక్కు, నాగలింగ పుష్పాల వంటి చెవులు, తెల్ల తామర రేకుల వంటి కళ్ళు, శంఖు పూవు లాంటి మెడ, నీలి మేఘాల కురులతో, కురవడానికి  ప్రేమ ఝరులు కురవడానికి  సిద్ధంగా  ఉంటే...అప్పుడే తుమ్మెద రెక్కల కనుబొమ్మల  క్రింద చెమక్కు మనే నీ కంటి మెరుపు, ఇంద్ర ధనస్సు చుట్టుకున్నట్లు ,నీ వలువలు, హంసధ్వని రాగం లా నీ నడక,నాచూపులు ఎప్పుడో సిగ్గు లేని వయ్యాయి.... ఒక్క చూపులేనా! నాకున్న దంతా నీకు ఇచ్చేసుకున్నాక  నాకు నేను లేనివాడి నయ్యానో ,నిన్ను పొందిన ప్రేమ ధనికుడనయ్యానో, శ్రుతి చేసే వైణికుడనయ్యానో తెలియకున్నది. నువ్వూ,నీ అలంకరణ,నీ ఆభరణసోయగాలు  అన్నీ ప్రకృతి పరమైనవే.  వనదేవత లా ఒకసారి,జలకన్యలా ఒక తూరి,హిమకన్యలా ఒకపరి, ఇక ఇవన్నీ నాటి అందాల చిత్రాలు, చిట్టాలు...ఇప్పుడైతే మీ వయసులో నీ మెత్తని చీర అమ్మ ఒడి, నీవు చూపించే శ్రద్ధ ,ప్రేమ,నాకోసం ఓ పికలేకున్నా చేసే వంటలు,పడే తంటాలు, నా ఇష్టాలకోసం  చేసే ఓపిక లేకున్నా వాళ్ళ దగ్గరకు వెళ్లడం...

జర్నలిస్ట్ ల సంక్షేమమే ఫెడరేషన్ ద్యేయం

జర్నలిస్ట్ ల సంక్షేమమే ఫెడరేషన్ ద్యేయం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జర్నలిస్టుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ద్యేయం ఆని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ అన్నారు. ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షుడు ఎం. రవికుమార్ అధ్యక్షతన ఆదివారం స్థానిక దేవి చౌక్ లోని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కార్యాలయంలో ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఫెడరేషన్ బాపట్ల జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షుడుగా వేమూరు మండల సాక్షి విలేఖరి పి. బుల్లియ్యను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు,  అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాల సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఆయా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు టి. రవీంద్రబాబు, జి. ప్రభాకరరావు, బి సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్, ఎం సుబ్బారావు, కె సాంబశివరావు, సభ్యులు  జి ప్రకాశ రావు, సిహెచ్ రవి కిరణ్, వి.డి.భూషణం, ఎం ప్రసాద్, వి. లక్ష్మణరావు, ఎన్ జే సామ్యూల్, డి వెంకటేశ్వరరావు, ప్రేమ్ కుమార్, బి.చందు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ ల సంక్షేమమే ఫెడరేషన్ ద్యేయం

జర్నలిస్ట్ ల సంక్షేమమే ఫెడరేషన్ ద్యేయం జర్నలిస్టుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ద్యేయం ఆని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ అన్నారు. ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షుడు ఎం. రవికుమార్ అధ్యక్షతన ఆదివారం స్థానిక దేవి చౌక్ లోని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కార్యాలయంలో ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఫెడరేషన్ బాపట్ల జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షుడుగా వేమూరు మండల సాక్షి విలేఖరి పి. బుల్లియ్యను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు,  అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాల సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఆయా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు టి. రవీంద్రబాబు, జి. ప్రభాకరరావు, బి సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్, ఎం సుబ్బారావు, కె సాంబశివరావు, సభ్యులు  జి ప్రకాశ రావు, సిహెచ్ రవి కిరణ్, వి.డి.భూషణం, ఎం ప్రసాద్, వి. లక్ష్మణరావు, ఎన్ జే సామ్యూల్, డి వెంకటేశ్వరరావు, ప్రేమ్ కుమార్, బి.చందు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

నేటి కోసం నాటి విభరిస్తా

* శీర్షిక: నేటి కోసం నాటి విభరిస్తా !* ************************" కన్నీటిని వరిస్తా! చరిస్తా! స్మరిస్తా! తరిస్తా! భరిస్తా! ఎన్ని శిశిరాలు భరించానో నేటి వసంతం అనే సంతకం కోసం. .ఎన్ని అమావాస్యలు. వలచానోనేటి  పున్నములు  కోసం! వ్యధా భరిత హృదయంతో...ఈ కనుల క్రింద కష్టాల మస్కరా.. నా సాహసాలకు గుర్తేగా.. అడుగడుగునా ముళ్ళు  తొక్కిన నా అరి కాళ్లకు పెట్టు మచ్చలుగా పుట్టు మచ్చల సోయగాలు! ఈ బుగ్గల్లో మెరుపులు అసలు తగ్గవు మరి! ఆత్మవిశ్వాసం  నా గుండెలాగే గట్టిది.. ఎన్ని ఉలిదెబ్బలతో శిల్పం అయ్యానో గానీ ,ప్రతి బాధకు ఒక క్రొత్త అందాన్ని, ఒక కొంగ్రొత్త మెరుపుని  అద్దుకున్నా! అద్దమ రేయి మేలుకుని గత స్వప్నాలు వాస్తవాలు ఏ రుతున్నా!  అలికిన  సుకుమార నా అరచేతులకు  పుట్టగొడుగుల కాయల గాయాలు!  దిగుళ్ల నెగళ్ళ లో జ్వలించుచూ బ్రతికే జీవితం! అనుక్షణం ఆశను తోడుతూ, కలల బ్రతుకులో, దినమొక గండంలా నిస్తేజం తో , నోరు నొక్కుకుని కనలు తున్న  సంక్షేమ మెరుగని క్షామ క్షుదిత  హృదయం!  ధైర్యం తింటూ బ్రతకడమే నా జీవన పయనం గా గమ్యం లేని చోటకు నిద్రలో నడుస్తున్న నిర్వే...

మార్చి 17 నుంచి జాతీయస్థాయి విజ్ఞాన్‌ ‘‘సృజనాంకుర–2కే23

మార్చి 17 నుంచి జాతీయస్థాయి విజ్ఞాన్‌ ‘‘సృజనాంకుర–2కే23 ’’   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  ‘‘విజ్ఞాన్‌ సృజనాంకుర –2కే23’’ పోస్టర్లు ఆవిష్కరణ ముఖ్య అతిథిగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి జాతీయస్థాయిలో పోటీలు ఆయా రాష్ట్రాల నుంచి 15వేల మంది విద్యార్థుల రాక విజేతలకు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు  ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు  వేలాదిగా ప్రయోగ నమూనాల ప్రదర్శన సృజనాంకుర–2కే23 పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో భారీ ప్రణాళిక, వ్యయంతో తమ యూనివర్సిటీ జాతీయస్థాయి సృజనాంకుర ఆవిష్కరణలను మార్చి 17, 18 తేదీలలో రెండురోజుల పాటు నిర్వహిస్తోందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం  విజ్ఞాన్‌ సృజనాంకుర–2కే23 పోస్టర్లను ...

డేంజర్! యమ డేంజర్

 డేంజర్! యమ డేంజర్! ************************ వరదల్లే వస్తుందో ఉప్పెన గా మారుతుందో తెలియదు గానీ ఇది డేంజర్ యమ డేంజర్! నిన్ను ఒక్క నిమిషం కదల నివ్వక కట్టి పడేస్తుంది. ఉక్కిరి బిక్కిరి చేసి హాయైన ఉచ్చుల్లోనో,న్నడు కితకితల కుచ్చు ల్లోనో బిగిస్తుంది. రంగుల లోకంలో దేవుల పల్లి కవితలా, జంధ్య్యాల సినిమా లా ఆనందపు జల్లులు తోతడిపి తడిపి ప్రేమనగర్ లో బంధిస్తుంది.. ఎన్నో ముషాయిరాలలో పాల్గొన్నట్లు,వెన్నెల వాకలో తడిసినట్లు, నాట్యా కళా చూసినట్లు,సంగీత విభావరి లో మునిగి నట్లు ,గుండె పట్టనంత ఆనందం మరి! గుండె పక్షిలా మారి ఎగిరి పోతున్న అనుభూతి,మనలో మనం నవ్వుతూ *లవ్* కి కంలో , అలౌకికానుభూతి! పిచ్చితనమో! అనుభవాలు పండని పచ్చి తనమో! ప్రేమ వెచ్చని తనమో గానీ ఇదేదో బాగుంది అనిపిస్తుంది. సముద్రాలు,లోయలు,సుందర దృశ్యాలు,చారిత్రక స్థలాలు, ఎటుచూసినా, విరగ బూసిన గుల్ మొహర్ చెట్టులా అనిపించి,గానుగ పూల తలంబ్రాలు పోసినట్లు ఒకటే ఆనందం!  ఏగాలి వీచినా మనకోసమే,ఏ పువ్వు విచ్చినా తనకోసమే, రంగుల ప్రపంచం లో రసరమ్యంగా, హృదయం పూచిన ఉద్యాన వనం లా మారిన క్షణాలు మరి! మరి ఇంత జరిగాక ఎందుకీ విరహతాపాలు, విడిపోయి పర...

మాతృభాష సేవశిరోమణి జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు.

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార బాషా సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ సహకార, సౌజన్యంతో మంగళవారం విజయవాడ లోని పార్క్ ఐరిష్ ప్రైమ్ హోటల్ నందు   ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా మాతృభాష సేవశిరోమణి జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ నాసికా చిత్రకారుడు సద్గురు ది స్కూల్ అఫ్ ఆర్ట్స్ నిర్వాహకులు సత్యవోలు రాంబాబు.    ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. వి. ఆర్.కృష్ణంరాజు గారు,రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఐటీ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కుర్రా శాంతిశ్రీకు తమ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పీహెచ్‌డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శుక్రవారం తెలియజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఏన్‌ ఎఫిసియంట్‌ కీ మేనేజ్‌మెంట్‌ స్కీమ్‌ ఫర్‌ మేనేజింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ యూజర్స్‌ ఇన్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ యూజింగ్‌ ఎల్లిప్టిక్‌–కర్వ్‌ అండ్‌ డిఫ్పీ–హెల్‌మన్‌ కీ ఎక్స్‌చేంజ్‌ ’’ అనే అంశంపై పరిశోధన చేసిందని తెలియజేసారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ విభాగాధిపతి, ప్రొఫెసర్‌ ఎన్‌.వీరాంజనేయులు గైడ్‌గా వ్యవహరించారు.  ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 4 స్కూపస్‌ పబ్లికేషన్స్, 3 కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టాపొందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కుర్రా శాంతిశ్రీను విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్...

ఎ. ఎన్. యూ అంబేద్కర్ చైర్ విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డాక్టర్ కనపర్తి నియామకం

ఎ. ఎన్. యూ అంబేద్కర్ చైర్ విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డాక్టర్ కనపర్తి నియామకం తెనాలి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చైర్ విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డాక్టర్  కనపర్తి అబ్రహాఁ లింకన్ నియమితులయ్యారు. గురువారం ఉదయం ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  మేరుగ నాగార్జున, తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ లను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజశేఖర్,యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ బట్టు నాగరాజు లను గౌరవ పూర్వకంగా కలిశారు.

చరిత్ర చెక్కిన ప్రేమకథల దృశ్యరూపం "ప్రియ సఖి" నాటకం

చరిత్ర చెక్కిన ప్రేమకథల దృశ్యరూపం "ప్రియ సఖి" నాటకం .  హైదరాబాద్: ఫలించిన ప్రేమల కంటే విఫలమై పోయిన విషాద ప్రేమ కథలే నేటికీ చరిత్రలో సజీవంగా నిలచి పోయాయి అని నిరూపిస్తూ వాటిని కళ్ళకు  కట్టినట్లుగా రంగస్థలంపై ఆవిష్కరించారు డా.శ్రీజ సాదినేని. రసరంజని సంస్థ నిర్వహించే నెలవారీ కార్యక్రమాల్లో రవీంద్ర భారతిలో బుధవారం సాయంత్రం శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన ప్రియసఖి నాటకం ప్రేక్షకులతో కంట తడి పెట్టించింది. ప్రేమ కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ప్రేమ జంటలను సజీవంగా రంగస్థలంపై ఆవిష్కరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంది.చక్కని సంభాషణలు, దర్శకత్వ ప్రతిభ, లైటింగ్ టెక్నాలజీతో పాటు డా.శ్రీజ సాదినేని నటన వెరసి ఈ నాటకం ప్రేక్షకుల కంటికి కమ్మని విందును అందించింది. నాటకం మొదలైన క్షణం నుండి ముగిసే వరకు ప్రేక్షకులు కంటి రెప్ప కూడా కొట్టకుండా, కుర్చీ నుండి కదలకుండా ఆద్యంతం ఆసక్తిగా తిలకించడం విశేషం. డా.శ్రీజ సాదినేని రచించి, దర్శకత్వం వహించి, ముఖ్య భూమికను పోషించి నిర్వహించిన ఈ నాటకంలో  శశిధర్ ఘణపురం, అవినాష్ యాదవ్, ఏ...

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిస్టుల సమస్యల వినతిపత్రం

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిస్టుల సమస్యల వినతిపత్రం   -ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ రావు గారు నంద్యాల పర్యటనలో భాగంగా జర్నలిజం డిపార్ట్మెంట్ కోర్స్ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ క్లాసులు ప్రారంభించేందుకు నంద్యాల చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నంద్యాల నాయకులు గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు, అధ్యక్షులు శివ, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్, ఉపాధ్యక్షులు యలనాటి జాషువా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఆ రంగుల మధు కుమార్, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో సత్కరించారు అనంతరం కొమ్మినేని శ్రీనివాస్ రావు గారికి నంద్యాల జర్నలిస్టుల సమస్యలు వివరించారు అనంతరం రాష్ట్రంలో జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ రావు దృష్టికి తీసుకొచ్చారు జర్నలిస్టులపై విధించిన నిబంధనలను సడలించాలని అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు నివాస గృహాలు నిర్మించాలని జర్నలిస్టు పిల్లలకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందించా...

రత్నాకర్ దర్శకత్వం లో వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ప్రారంభం

రత్నాకర్ దర్శకత్వం లో వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ప్రారంభం హైదరాబాద్: జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనపర్తి రత్నాకర్  దర్శకత్వం వహిస్తున్న వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ఆదివారం మాదాపూర్ లోని జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభమైనది. ముఖ్య అతిధిగా  ఆ నలుగురు చిత్ర నిర్మాత ప్రేమకుమార్ పట్రా ముఖ్యఅతిథిగా పాల్గొని నటీనటులపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం లో రత్నాకర్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారని వెన్నెలొచ్చింది చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావడం హర్షణీయం. చైల్డ్ సూపర్ స్టార్ మాష్టర్ బాను ప్రకాష్, మాస్టర్ జోవెన్ లు హీరోలుగా నటిస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ  విద్య యొక్క అవసరతను తెలియజేస్తూ , పూర్తి సందేశాత్మకం గా సాగుతుందన్నారు. మార్చ్ రెండోవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందన్నారు. రాజయోగం చిత్ర దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ రత్నాకర్ ప్రతిభ గల దర్శకుడన్నారు. ఆర్ట్ డైరెక్...

సఖా! ఇది లేఖో! ప్రేమ కవన రేఖో

శీర్షిక:  సఖా! ఇది లేఖో! ప్రేమ కవన రేఖో ! నువ్వు నాకెప్పుడూ ఒక అద్భుతానివి.మనసు నిండా నిండిన మల్లెల సౌరభానివి!మధురోహలను నింపేస్వప్నసుందరునివి..నాకోసమే  ననిపించే హాయి నిచ్చే మాయవి ! నిన్ను తలచిన ప్రతిక్షణం నా పెదవులపై సిగ్గుల చిరునవ్వుల తళుకులు! ఉద్విగ్నత తో కూడిన గుండె లయల ఝల్లు...ఏ హిమగిరి సానువులలోనో వ్రతం ప్రక్కన బెట్టిన ప్రవరాఖ్యునిలా  .. మురిపిస్తావు. వెచ్చదనం నా ఒంటికి అద్ది,ఆనందాన్ని  మింటికి చేరుస్తావు .నువ్వు వందల మైళ్ళు  దూరంలో వున్నా...సందేశాల మొయిలు  మోయలేని హాయి  నిస్తుంది. నీ మాటను, నీ రూపాన్ని,నీ రచనా సరళి నీ  ప్రతి విషయాన్ని ఆరాధిస్తున్నా! ఆరాధి స్తూనే ఉంటా! నీ ఆలోచన మధుర స్వ ప్నాల రాశులతో  నను నిరంతరం మై మరపిస్తుంది.అన్నింటి కంటే ముందు  నిన్ను తలచుకుంటే నేను అమ్మాయి ననే విషయం నాకుగుర్తుకువస్తుంది.నిజంగా నువ్వు నాకోసం  ఉన్నావనిఅనిపిస్తుంది.,* *నన్ను  మెప్పించాలనీ అసలు ఏనాడూ అనుకోవు.నేను నిన్ను తలచుకుంటే ఎంత  వత్తిడి లో నున్నా...... ఆనంద లహరి లో, అధ్భుత ప్రపంచంలో విహరిస్తూ.. *హాయిగా,సంతోషంగా* *ఉత...

రేపటి నుంచి విజ్ఞాన్‌ మహోత్సవ్‌

రేపటి నుంచి విజ్ఞాన్‌ మహోత్సవ్‌  మూడు రోజుల పాటు అలరించనున్న జాతీయస్థాయి వేడుకలు  సందడి చేయనున్న సినీతారలు ఆయా రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థుల రాక చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి విజ్ఞాన్‌ మహోత్సవ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ విజ్ఞాన్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నేటి నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ప్రతిఏటా విజ్ఞాన్‌ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ యూత్‌ సర్వీసెస్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ జీ.వాణీమోహన్‌ (ఐఏఎస్‌), గౌరవ అతిథిగా ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్‌ (ఐపీఎస్‌) హాజరవుతారని వెల్లడించారు. విజ్ఞాన్‌ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థులు తరలి రానున్నారని వెల్లడించారు.  విజ్ఞాన్‌ మహోత్సవ పోటీల విజేత...

చిరుధాన్యాలే మానావాళి ఆరోగ్యానికి ఔషధాలు

చిరుధాన్యాలే మానావాళి ఆరోగ్యానికి ఔషధాలు   ఫుడ్‌ అండ్‌ హెల్త్‌ ఇండిపెండెంట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలి చిరుధాన్యాలను ప్రపంచ మానవాళి ఆహారంగా తీసుకున్నట్లైతే... అనేక రకాల ఆరోగ్య సమస్యలకు అవి ఔషధాలుగా పనిచేస్తాయని ఫుడ్‌ అండ్‌ హెల్త్‌ ఇండిపెండెంట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘ హెల్త్‌ బెనిఫిట్స్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫుడ్‌ అండ్‌ హెల్త్‌ ఇండిపెండెంట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలి మాట్లాడుతూ మానవాళి సంప్రదాయ ఆహార అలవాట్లను పాటించినట్లైతే ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. మీరు తీసుకునే ఆహారాన్ని ఔషధంగా భావించాలన్నారు. చిరుధాన్యాలను ముఖ్య ఆహారంగా తీసుకున్నటైతే మీరు ఏవిధమైన వ్యాధి బారిన పడే అవకాశం ఉండదన్నారు. ఎందుకంటే చిరుధాన్యాల వలన మనకు కావలసిన అన్ని పోషక విలువలు, లవణాలు, తక్కువ...

2030 నాటికి ఈవీ ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు

2030 నాటికి ఈవీ ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు   ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ప్రమోషన్స్‌ హెడ్, ఆటో అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సెక్టార్‌ లీడ్‌ రాజీవ్‌ కుమార్‌ వైఎస్సార్‌ 2030 సంవత్సరం నాటికి ఈవీ ( ఎలక్ట్రిక్‌ వెహికల్‌) ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు క్రియేట్‌ చేయబడుతాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ప్రమోషన్స్‌ హెడ్, ఆటో అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సెక్టార్‌ లీడ్‌ రాజీవ్‌ కుమార్‌ వైఎస్సార్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఆఫీస్‌ ఆఫ్‌ డీన్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘లేటెస్ట్‌ ట్రెండ్స్, ఫ్యూచర్‌ ప్రాస్పెక్ట్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఆపర్చునిటీస్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ టెక్నాలజీస్‌’’ అనే అంశంపై శనివారం ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ప్రమోషన్స్‌ హెడ్, ఆటో అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సెక్టార్‌ లీడ్‌ రాజీవ్‌ కుమార్‌ వైఎస్సార్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక...

కొన్నాళ్ళు ప్రేమించడం మానేయ వోయ్

శీర్షిక:   కొన్నాళ్ళు ప్రేమించడం మానేయ వోయ్ ! ********************************* నీ చూపుల కోసం ఎదురు చూసే బాధ!  నీసందేశాలకువేచివేసారియుండే గాథ! ప్రేమ పలుకులకై తపించే నా  వేదన! మెచ్చుకోలుకై  నేను జపించే శోధన ! నాకెందుకు చెప్పు!? కొన్నాళ్ళు ప్రేమించడం మానేయి. కొన్నేళ్లునటించడంనిరభ్యంతరంగా నువ్వు ఆపేసేయి. నువ్వు వస్తావు ఎక్కడనుండో ఓ సంచితో,నాసంచిత మేమో గానీ.. అందులో మెరుపు కలల గాలిబుడగ లు బయటకి వస్తాయని నా చూపు! కానీ నా ఉత్సాహం నీరు గారుస్తూ  అశాంతిగా నీ అరుపు! ఎందరినో మురిపెంగా స్తుతించే నీ సంభాషణా చాతుర్యం నాకు బాగా తెలుసు!  కొందరిని  మాత్రమే ముగ్ధులను చేసే నీ సునిశిత హాస్య వల్లరీ  తెలుసు! ఇల్లునీ, ఇల్లాలిని రాత్రి మాత్రమే ప్రేమించే ప్రత్యేకమైన అలుసు! అపుడపుడు మల్లెలు,మంచాలు గుర్తుకు వచ్చేమగతనపు పెళుసు! నువ్వు మాట్లాడడం కొన్నాళ్ళు మానే యి, ప్రేమించాననుకుని కాట్లాడడం , మూన్నాళ్లు తీసేయి! నీనుండీ ఏమి పొందక పోయినా నా సేవలలో మార్పులు రావు. నీ  మౌనం  లో  నేనుండక  పోయినా నా మమతల  చేర్పులు పోవు. అడిగి అడిగి తీసుకునే ప్ర...

విజ్ఞాన్స్‌లో ఘనంగా ఐపీఆర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా ఐపీఆర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈ–సెల్, నిపమ్‌ ( నేషనల్‌ ఇంటెలెక్చుయల్‌ ప్రాపర్టీ అవేర్‌నెస్‌ మిషన్‌)ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ వర్చువల్‌ వర్క్‌షాప్‌ ఆన్‌ ఐపీఆర్‌ అవేర్‌నెస్‌ ’’ అనే అంశంపై విద్యార్థులకు గురువారం అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైలోని ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌లోని పేటెంట్స్‌ అండ్‌ డిజైన్స్‌ ఎగ్జామినర్‌ వీ.తిలక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సరికొత్త ఇన్నోవేషన్స్‌ను సృష్టించే విద్యార్థులు వాటిపై పేటెంట్స్‌ను పొందడం వలన దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు పేటెంట్స్‌ను సాధించడానికి ఎలా ప్రయత్నించాలో దశల వారీగా వివరించారు. రీసెర్చ్‌ జర్నల్స్‌కు– పేటెంట్స్‌కు మధ్య వ్యత్యాసాలను విద్యార్థులకు విశదీకరించారు. రీసెర్చ్‌ జర్నల్స్‌ కోసం ప్రయత్నించకుండా విద్యార్థులు పేటెంట్స్‌ను సాధించినట్లైతే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడంత...

జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయభేరి

జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయభేరి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ‘‘విజ్ఞాన్‌’’ విద్యార్థులు విజయభేరి మోగించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌  మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా  చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జే.మోహనరావు మాట్లాడుతూ మా వద్ద ఐఐటీ మెయిన్స్‌ కోచింగ్‌ తీసుకున్న విద్యార్థులలో 25 శాతం మంది విద్యార్థులు 90 శాతంపైగా పర్సంటైల్‌ సాధించారని పేర్కొన్నారు. అందులో డీ.నీరజ్‌బాబు (99.21), జీ.జితేంద్ర మోహన్‌ (98.48), జీ.విష్ణువర్ధన్‌ బాబు (97.69), ఎం.జస్వంత్‌ సాయి (97.51), ఎం.పవన్‌సాయి (95.42), ఏ.సంపత్‌ (95.27), ఎస్‌.శ్రీరామ్‌ ( 95.15), వై.ఈశ్వర సుమంత్‌ ( 94.96), ఎం.దిలీప్‌బాబు ( 94.84), ఎం.వరుణ్‌ (94.75), జే.చంద్రశేఖర్‌ ( 94.37), బీ.ఓం సాయి చంద్‌ (94.3), జే.వీరభద్ర (93.98), కే.వెంకటశివ ప్రణయ్‌ (93.55), ఏ.లోకేష్‌ (90) పర్సంటైల్‌ సాధించారని వెల్లడించారు. గత 44 సంవత...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ‘‘వర్టెక్స్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ‘‘వర్టెక్స్‌ ’’ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఙాన్స్‌ యూనివర్సిటీలో ‘‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ కార్యకలాపాలు ప్రారంభించి ఒక సంవత్సరం పూరైన సందర్భంగా ‘‘వర్టెక్స్‌’’ (విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ రీక్రియేషనల్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషనల్‌ ఎక్సీపీరియన్స్‌’’ అనే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ద్వారా బీబీఏ(జనరల్‌), ఎంబీఏ (హెచ్‌ఆర్‌), ఎంబీఏ (ఫైనాన్స్‌), ఎంబీఏ(జనరల్‌), బీసీఏ, ఎంసీఏ విభాగాలలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులందరూ ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వీవోఎక్స్‌ ( విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ఎక్స్‌పీరియన్స్‌) అనే ప్లాట్‌ఫామ్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరవింద్ వారియర్ People, Strategy, Culture and Happiness at Litmus7  Head మాట్లాడుతూ వీవోఎక్స్‌ వలన విద్యార్థులకు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లతో పాటు ప్రముఖ విద్యావేత్తల నుంచి గైడెన్స్‌తో కూడిన మెంటర్‌షిప్‌ పొందే అవకాశం ఉందన్నారు. దీని వలన విద...

కళాతపస్వి కే.విశ్వనాథ్‌కు విజ్ఞాన్స్‌లో ఘన నివాళి

కళాతపస్వి కే.విశ్వనాథ్‌కు విజ్ఞాన్స్‌లో ఘన నివాళి చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులందరూ కలిసి ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్‌కు శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపు తీసుకురావడంలో విశ్వనాథ్‌ గారు చాలా కృషి చేశారన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు, చిత్రసీమకు ఎనలేని ప్రతిష్టను తెచ్చాయని పేర్కొన్నారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్‌ చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారితీశాయన్నారు. కళా రంగంతో పాటు సాహిత్యంలో ఎన్నో ఘనతలు సాధించిన కళాతపస్వి కే.విశ్వనాథ్‌గారికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించి... సిని రంగంలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు సాధించేదా...

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈఈఈ  డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్యార్థి పీ.పోతురాజుకు తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం గురువారం తెలియజేసింది. ‘‘ డిజైన్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ ఎంబెడెడ్‌ చాపర్‌ విత్‌ బైడైరెక్షనల్‌ డ్యూయల్‌ పోర్ట్‌ డీసీ–ఏసీ కన్వర్టర్‌ ఫర్‌ వైడ్‌ వోల్టేజ్‌ రేంజ్‌ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని వెల్లడించింది. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మోపిదేవి సుబ్బరావు గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం ఎస్‌సీఐ–2, ఈఎస్‌సీఐ–1, స్కోపస్‌ జర్నల్స్‌–3, ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు 2 ప్రచురించారని తెలిపింది. పీహెచ్‌డీ పట్టాపొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పీ.పోతురాజును విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

మాస్టారు మాస్టారు వీడియో సాంగ్ షూటింగ్ ప్రారంభం

మాస్టారు మాస్టారు వీడియో సాంగ్ షూటింగ్ ప్రారంభం తెనాలి: స్థానిక చినరావూరు లోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం ఉదయం మాస్టారు.. మాస్టారు అనే వీడియో సాంగ్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. దర్శకుడు కనపర్తి రత్నాకర్ ప్రారంభోత్సవం లో ముఖ్యఅతిథిగా పాల్గొని నటీ,నటులపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ది స్ట్రేంజ్ డ్రీమర్స్ బ్యానర్ పై నిర్మాత ప్రవల్లిక కొండ్రు ఈ సాంగ్ ను రూపొందిస్తున్నారు. కొరియోగ్రాఫర్ కిరణ్ కొండ్రు దర్శకత్వం వహిస్తున్నారు. హీరో, హీరోయిన్ లుగా బబులు చెర్రీ, కావ్యాలు నటిస్తున్నారు. డి. ఓ.పిలుగా హృతిక్, అల్తాఫ్ లు వ్యహరిస్తున్నారు. కార్యక్రమంలో పలువురు కళాకారుల పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘‘ఏఏ’’ గ్రేడ్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘‘ఏఏ’’ గ్రేడ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఐఐటీ మద్రాస్‌ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్‌పీటీఈల్‌ ర్యాంకింగ్స్‌లో ‘‘ఏఏ గ్రేడ్‌’’ లభించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వయం ఎన్‌పీటీఈఎల్‌ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జాతీయస్థాయిలో 22వ ర్యాంక్‌ సాధించి ‘‘ఏఏ గ్రేడ్‌’’ను సొంతం చేసుకుందన్నారు. ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ రకాల కోర్సులలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు పాల్గొని 1919 కోర్సు సర్టిఫికెట్లు సాధించారన్నారు. వీటిలో 42 మందికి టాపర్స్, 22 గోల్డ్, 229 సిల్వర్, 775 ఎలైట్, 893 మంది సాధారణ ఉత్తీర్ణత సర్టిఫికెట్స్‌ సాధించారని వెల్లడించారు. 2022వ సంవత్సరంలో ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ రకాల కోర్సులలో జూలై నుంచి డిసెంబర్‌æ వరకు నిర్వహించిన కోర్సులలో ఉత్తమ ప్రతిభకు గాను విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ‘‘ఏఏ గ్రేడ్‌’’ లభించిందని వెల్లడించారు. వీటితో పాటు గరిష్టంగా ఎక్కువ మంది డొమైన్‌ స...