కొన్నాళ్ళు ప్రేమించడం మానేయ వోయ్

శీర్షిక:
 కొన్నాళ్ళు ప్రేమించడం మానేయ వోయ్!
*********************************
నీ చూపుల కోసం ఎదురు చూసే బాధ!  నీసందేశాలకువేచివేసారియుండే గాథ!
ప్రేమ పలుకులకై తపించే నా  వేదన!
మెచ్చుకోలుకై  నేను జపించే శోధన !
నాకెందుకు చెప్పు!? కొన్నాళ్ళు ప్రేమించడం మానేయి.
కొన్నేళ్లునటించడంనిరభ్యంతరంగా
నువ్వు ఆపేసేయి.
నువ్వు వస్తావు ఎక్కడనుండో ఓ సంచితో,నాసంచిత మేమో గానీ..
అందులో మెరుపు కలల గాలిబుడగ లు బయటకి వస్తాయని నా చూపు!
కానీ నా ఉత్సాహం నీరు గారుస్తూ  అశాంతిగా నీ అరుపు!
ఎందరినో మురిపెంగా స్తుతించే నీ సంభాషణా చాతుర్యం నాకు బాగా తెలుసు!
 కొందరిని  మాత్రమే ముగ్ధులను చేసే నీ సునిశిత హాస్య వల్లరీ  తెలుసు!
ఇల్లునీ, ఇల్లాలిని రాత్రి మాత్రమే ప్రేమించే ప్రత్యేకమైన అలుసు!
అపుడపుడు మల్లెలు,మంచాలు గుర్తుకు వచ్చేమగతనపు పెళుసు!
నువ్వు మాట్లాడడం కొన్నాళ్ళు మానే యి, ప్రేమించాననుకుని కాట్లాడడం , మూన్నాళ్లు తీసేయి!
నీనుండీ ఏమి పొందక పోయినా నా సేవలలో మార్పులు రావు.
నీ  మౌనం  లో  నేనుండక  పోయినా
నా మమతల  చేర్పులు పోవు.
అడిగి అడిగి తీసుకునే ప్రేమలో
అసలు సిసలు పరిమళం లేదోయి!
కొసరి కొసరి ఇచ్చే వలపు లోనే గుండెను తాకే సుగంధాల హాయి!
నేనుచెప్తున్నాగా, కొన్నాళ్ల వరకూ నీ మాటల మాయల కృత్రిమ సోయగాలు ఆపేసేయి!
నీవు భిక్షగా వేస్తున్నా నా కంటితుడుపు బహుమానాలు  పారేసేయి!
నిశ్శబ్దంగా నా శ్రమను పరిశీలిస్తూ, పరిశోధిస్తూ ఫో!
అంతర్నేత్రం తెరుచు కోగానే , నీ అంతరాత్మ ప్రబోధ మొదలవుతుంది.
అప్పుడు *మనవాడిన,మనువాడిన*  ప్రేమకల మళ్ళీ చివురులు వేసి కళ కళ లాడుతుంది.
ఇకనీగొంగళిపురుగుఆలోచనలన్నీ,గూడు వదలిన సీతాకోక చిలుకలై రంగుల రెక్కలతో ఎగురుతాయి.
నా కనులలో కళలు, కలలు కొత్త ఊపిరులు పోసుకుని మిల మిలా మెరుస్తాయి.
నువ్వు పద్మశ్రీ వో, పద్మభూషణుడవో, అత్యున్నత కంపెనీ కి అధినేతవో, దేశనేతవో అయితే కానీయి!
అది మరచిపోయి *మొగుడు* అనే విషయం మాత్రమే గుర్తుబెట్టుకో!
ఈ భువిలో నీ భూమిక సవ్యంగా నిర్వహిస్తున్నావో లేదో, ఒక్కసారి నిన్ను నీవు చెక్ చేసుకో చాలు! అదేమేలు! పదివేలు!
********************************
*బి హెచ్. వి.రమాదేవి.*
*రాజమహేంద్రవరం.*
*చర వాణి:6305543917*
*తేది:14_7_22*