నేటి కోసం నాటి విభరిస్తా

*శీర్షిక: నేటి కోసం నాటి విభరిస్తా!*
************************"
కన్నీటిని వరిస్తా! చరిస్తా! స్మరిస్తా! తరిస్తా! భరిస్తా!
ఎన్ని శిశిరాలు భరించానో నేటి వసంతం అనే సంతకం కోసం.

.ఎన్ని అమావాస్యలు. వలచానోనేటి  పున్నములు  కోసం! వ్యధా భరిత హృదయంతో...ఈ కనుల
క్రింద కష్టాల మస్కరా..
నా సాహసాలకు గుర్తేగా..

అడుగడుగునా ముళ్ళు 
తొక్కిన నా అరి కాళ్లకు
పెట్టు మచ్చలుగా పుట్టు మచ్చల సోయగాలు!
ఈ బుగ్గల్లో మెరుపులు
అసలు తగ్గవు మరి!

ఆత్మవిశ్వాసం  నా గుండెలాగే
గట్టిది.. ఎన్ని ఉలిదెబ్బలతో
శిల్పం అయ్యానో గానీ ,ప్రతి బాధకు ఒక క్రొత్త అందాన్ని,
ఒక కొంగ్రొత్త మెరుపుని 
అద్దుకున్నా! అద్దమ రేయి
మేలుకుని గత స్వప్నాలు
వాస్తవాలు ఏ రుతున్నా! 

అలికిన  సుకుమార నా అరచేతులకు  పుట్టగొడుగుల కాయల గాయాలు! 
దిగుళ్ల నెగళ్ళ లో జ్వలించుచూ బ్రతికే జీవితం!

అనుక్షణం ఆశను తోడుతూ,
కలల బ్రతుకులో, దినమొక
గండంలా నిస్తేజం తో , నోరు
నొక్కుకుని కనలు తున్న  సంక్షేమ మెరుగని క్షామ క్షుదిత  హృదయం! 

ధైర్యం తింటూ బ్రతకడమే
నా జీవన పయనం గా
గమ్యం లేని చోటకు
నిద్రలో నడుస్తున్న నిర్వేదంతో 

నాకు నేనే చెప్పుకుని సాంత్వన పొందే బ్రతుకు లో
బలహీనత లేని ఎరుగని 
బురఖా తగిలించుకుని,
నడుస్తున్న ధైర్యం నైతే

అదేమిటో బతుకంటే
నాకెందుకో విసుగే రాదు మరి
సాహిత్యం తిని పిం (పెం)చి,
చావు,బ్రతుకు,సుఖం,దుఃఖం
ఒకటే ననే భావన కలిగించి నందుకనుకుంటా!

నువ్వేదో వచ్చి,రసమయం చేశావనుకుంటే అది త్రిశంకు స్వర్గం లా ,నన్ను ఎగురనీయక,నిన్ను చెంతకు
చేర్చక,.చింతల పాలై..
నిశ్చింతల ఎదురు చూపుల
దారులు పరిచి పోతూ..
మాయమవుతూ...
ధ్యానిస్తూ నను తాపసిని,
రూపసి నీ చేస్తే .. అది
నిశ్చ యంగా నీ తలపుల తప్పే, నీ మమతల గుప్పే!
కాదంటావా! ప్రియతమా!
************************
డా. బి .హెచ్.వి.రమాదేవి.
రాజమహేంద్రవరం.
చర వాణి:6305543917.