డేంజర్! యమ డేంజర్

 డేంజర్! యమ డేంజర్!
************************
వరదల్లే వస్తుందో ఉప్పెన గా మారుతుందో తెలియదు గానీ
ఇది డేంజర్ యమ డేంజర్!
నిన్ను ఒక్క నిమిషం కదల నివ్వక కట్టి పడేస్తుంది.
ఉక్కిరి బిక్కిరి చేసి హాయైన
ఉచ్చుల్లోనో,న్నడు కితకితల
కుచ్చు ల్లోనో బిగిస్తుంది.
రంగుల లోకంలో దేవుల పల్లి
కవితలా, జంధ్య్యాల సినిమా లా ఆనందపు జల్లులు తోతడిపి తడిపి ప్రేమనగర్ లో
బంధిస్తుంది..
ఎన్నో ముషాయిరాలలో పాల్గొన్నట్లు,వెన్నెల వాకలో
తడిసినట్లు, నాట్యా కళా చూసినట్లు,సంగీత విభావరి
లో మునిగి నట్లు ,గుండె పట్టనంత ఆనందం మరి!
గుండె పక్షిలా మారి ఎగిరి పోతున్న అనుభూతి,మనలో
మనం నవ్వుతూ *లవ్* కి కంలో , అలౌకికానుభూతి!
పిచ్చితనమో! అనుభవాలు
పండని పచ్చి తనమో!
ప్రేమ వెచ్చని తనమో గానీ
ఇదేదో బాగుంది అనిపిస్తుంది.
సముద్రాలు,లోయలు,సుందర దృశ్యాలు,చారిత్రక స్థలాలు, ఎటుచూసినా, విరగ బూసిన
గుల్ మొహర్ చెట్టులా అనిపించి,గానుగ పూల తలంబ్రాలు పోసినట్లు
ఒకటే ఆనందం! 
ఏగాలి వీచినా మనకోసమే,ఏ పువ్వు విచ్చినా తనకోసమే,
రంగుల ప్రపంచం లో రసరమ్యంగా, హృదయం
పూచిన ఉద్యాన వనం లా మారిన క్షణాలు మరి!
మరి ఇంత జరిగాక ఎందుకీ
విరహతాపాలు, విడిపోయి
పరస్పర నిందా రోపణలు!
ప్రేమను అడుక్కోవడాలు!
ఎక్కడైనా నీచత్వం , జాలి
ఆశించడమే అగౌరవం! 
అందుకే ప్రేమికులారా!
నీటి బుడగ మనసుల్లారా!
నిజంకనబడని లోచను లారా!
ఏదోఆశించిఅందక బ్రేకప్చెప్పే
నిస్వార్థ మనుకుంటున్న
స్వార్ధ పరులారా! 

చిన్నా చితకా విషయాలకు
చావకండి సమా! నచ్చినట్టు
జీవితం లేకుంటే చచ్చినట్లు
బ్రతకండి! అనాధలకు
జీవితాలిచ్చి ,అద్భుతాలు
చేయించండి.
బూడిదగా మారితే ..ఇక్కడ
ఏడ్చే మన అమ్మమ్మ ల్లాంటి బలశాలులు  ఎవరూ లేరు.
 నిన్ను గుర్తుబెట్టు కోవడానికి
మెమరీ ఐకాన్ లు లేరు.
అందుకే చావడమే డేంజర్!
ఖచ్చితంగా చరిత్రలో
మనదొక పుట కాకున్నా,
జీవితం కార్టూన్ కాకూడదు.
కదిలించే అద్భుత దృశ్యం కావాలి,మనం లేకుంటే
ఒక్కరైనా బ్రతక లేక పోవాలి!
************************
రచన: 
డా. బి హెచ్.వి.రమాదేవి.
రాజమహేంద్రవరం.
చర వాణి:6305543917.
చర వాణి:25_2_23.