సఖీ! ప్రేమ చకుముఖీ

శీర్షిక:  
సఖీ!  ప్రేమ చకుముఖీ!
************************

నువ్వు గులాబీల   పెదవులతో నవ్వుతావు!
నువ్వు పువ్వు లాంటి ముక్కు, నాగలింగ పుష్పాల వంటి చెవులు, తెల్ల తామర రేకుల వంటి కళ్ళు, శంఖు పూవు లాంటి మెడ, నీలి మేఘాల కురులతో, కురవడానికి  ప్రేమ ఝరులు కురవడానికి  సిద్ధంగా  ఉంటే...అప్పుడే తుమ్మెద రెక్కల కనుబొమ్మల  క్రింద చెమక్కు మనే నీ కంటి మెరుపు, ఇంద్ర ధనస్సు చుట్టుకున్నట్లు ,నీ వలువలు,
హంసధ్వని రాగం లా నీ నడక,నాచూపులు ఎప్పుడో సిగ్గు లేని వయ్యాయి....
ఒక్క చూపులేనా! నాకున్న దంతా నీకు ఇచ్చేసుకున్నాక  నాకు నేను లేనివాడి నయ్యానో ,నిన్ను పొందిన ప్రేమ ధనికుడనయ్యానో,
శ్రుతి చేసే వైణికుడనయ్యానో తెలియకున్నది.
నువ్వూ,నీ అలంకరణ,నీ ఆభరణసోయగాలు  అన్నీ ప్రకృతి పరమైనవే.  వనదేవత లా ఒకసారి,జలకన్యలా ఒక తూరి,హిమకన్యలా ఒకపరి,
ఇక ఇవన్నీ నాటి అందాల చిత్రాలు, చిట్టాలు...ఇప్పుడైతే
మీ వయసులో నీ మెత్తని చీర అమ్మ ఒడి, నీవు చూపించే శ్రద్ధ ,ప్రేమ,నాకోసం ఓ పికలేకున్నా చేసే వంటలు,పడే తంటాలు, నా ఇష్టాలకోసం  చేసే ఓపిక లేకున్నా వాళ్ళ దగ్గరకు వెళ్లడం మానిన నీ ఆత్మీయతలు, నిజం నువ్వు లేని నేను అసంపూర్ణుడ నై,అమావాస్య చంద్రుడనై,విలువలేని ఇంద్రుడ నై నీ కోసం తపిస్తా! ఎప్పుడూ వదలకు, 
నువ్వున్నంత వరకే నేను హీరోని! లేకుంటే జీరోని!
 మరణం లో నైనా నీతో తీసుకుపో,మన బాంధవ్యం మోసుకుపో! ఒక్క కోరిక తీర్చుచాలు! (అ) నాథుని చేయకు సఖీ! 
నీతోనే జీవితం చంద్రముఖీ!.. ఇది నిజం!ప్రేమ చకుముఖీ!
నీ స్మరణం నాకు భయ హరణం! నీవే శరణం!
**********************
డా. బి హెచ్.వి. రమాదేవి.
రాజమహేంద్రవరం.
చర వాణి:6305543917.
27_2_23.