ఎ. ఎన్. యూ అంబేద్కర్ చైర్ విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డాక్టర్ కనపర్తి నియామకం

ఎ. ఎన్. యూ అంబేద్కర్ చైర్ విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డాక్టర్ కనపర్తి నియామకం
తెనాలి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చైర్ విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డాక్టర్  కనపర్తి అబ్రహాఁ లింకన్ నియమితులయ్యారు. గురువారం ఉదయం ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  మేరుగ నాగార్జున, తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ లను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
వైస్ ఛాన్సలర్
రాజశేఖర్,యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ బట్టు నాగరాజు లను గౌరవ పూర్వకంగా కలిశారు.