జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయభేరి

జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయభేరి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ‘‘విజ్ఞాన్‌’’ విద్యార్థులు విజయభేరి మోగించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌  మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా  చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జే.మోహనరావు మాట్లాడుతూ మా వద్ద ఐఐటీ మెయిన్స్‌ కోచింగ్‌ తీసుకున్న విద్యార్థులలో 25 శాతం మంది విద్యార్థులు 90 శాతంపైగా పర్సంటైల్‌ సాధించారని పేర్కొన్నారు. అందులో డీ.నీరజ్‌బాబు (99.21), జీ.జితేంద్ర మోహన్‌ (98.48), జీ.విష్ణువర్ధన్‌ బాబు (97.69), ఎం.జస్వంత్‌ సాయి (97.51), ఎం.పవన్‌సాయి (95.42), ఏ.సంపత్‌ (95.27), ఎస్‌.శ్రీరామ్‌ ( 95.15), వై.ఈశ్వర సుమంత్‌ ( 94.96), ఎం.దిలీప్‌బాబు ( 94.84), ఎం.వరుణ్‌ (94.75), జే.చంద్రశేఖర్‌ ( 94.37), బీ.ఓం సాయి చంద్‌ (94.3), జే.వీరభద్ర (93.98), కే.వెంకటశివ ప్రణయ్‌ (93.55), ఏ.లోకేష్‌ (90) పర్సంటైల్‌ సాధించారని వెల్లడించారు. గత 44 సంవత్సరాలుగా పరిమిత సంఖ్యలో ప్రవేశాలు కల్పిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి విజయమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు తగిన విధంగా తాము అందజేస్తున్న అత్యున్నత స్థాయి విద్యావిధానం వల్లనే తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని పేర్కొన్నారు. అత్యుత్తమ పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్, ప్రిన్సిపల్‌ జే.మోహనరావు, అధ్యాపక బృందం అభినందించారు.

ఫోటోరైటప్‌ :
మంచి పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్, ప్రిన్సిపల్‌ జే.మోహనరావు, అధ్యాపక సిబ్బంది.