విజ్ఞాన్స్‌లో ఘనంగా ఐపీఆర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా ఐపీఆర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈ–సెల్, నిపమ్‌ ( నేషనల్‌ ఇంటెలెక్చుయల్‌ ప్రాపర్టీ అవేర్‌నెస్‌ మిషన్‌)ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ వర్చువల్‌ వర్క్‌షాప్‌ ఆన్‌ ఐపీఆర్‌ అవేర్‌నెస్‌ ’’ అనే అంశంపై విద్యార్థులకు గురువారం అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైలోని ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌లోని పేటెంట్స్‌ అండ్‌ డిజైన్స్‌ ఎగ్జామినర్‌ వీ.తిలక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సరికొత్త ఇన్నోవేషన్స్‌ను సృష్టించే విద్యార్థులు వాటిపై పేటెంట్స్‌ను పొందడం వలన దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు పేటెంట్స్‌ను సాధించడానికి ఎలా ప్రయత్నించాలో దశల వారీగా వివరించారు. రీసెర్చ్‌ జర్నల్స్‌కు– పేటెంట్స్‌కు మధ్య వ్యత్యాసాలను విద్యార్థులకు విశదీకరించారు. రీసెర్చ్‌ జర్నల్స్‌ కోసం ప్రయత్నించకుండా విద్యార్థులు పేటెంట్స్‌ను సాధించినట్లైతే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారని పేర్కొన్నారు. అంతేకాకుండా పేటెంట్, డిజైన్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్, జియోగ్రాఫికల్‌ ఇండికేషన్, ఎస్‌ఐసీఎల్‌డీ, ట్రేడ్‌ సీక్రెట్, ట్రెడిషనల్‌ నాలెడ్జ్, గ్రాడ్యుయేషన్‌ తర్వాత విద్యార్థులకు ఉన్న కెరీర్‌ ఆపర్చునిటీస్‌  వంటి అంశాలను విద్యార్థులకు అర్ధవంతంగా వివరించారు. విద్యాసంస్థల నుంచి అప్లై చేసే పేటెంట్‌లకు గతంలో ఉన్న రూ. 25 వేల ఫీజును ప్రభుత్వం రూ.5600కు తీసుకుని వచ్చిందని తెలియజేసారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ ఈ–సెల్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ బీ.నాగేశ్వరరావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.