విజ్ఞాన్స్ యూనివర్సిటీలో వైభవంగా ‘కైజెన్–2కే23 ’ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ మీట్ ‘‘ కైజెన్–2కే23’ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కైజెన్( కీ టు ఆంబీషియస్ అండ్ ఇంటెలెక్చుయల్ జోన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నోవల్టీ)ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగగలిగితే పది మందికి ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. అందుకని ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులందరూ ఎప్పుడూ ఒకే విధంగా మూసధోరణిలో పనులు చేసుకుంటూ వెళితే కొన్నాళ్లకే బోరు కొట్టేస్తుందన్నారు. మీ పరిధిని దాటి సులువైన పద్ధతుల కోసం ఆలోచనలు చేయాలన్నారు. చేసే పనులను కాస...