18న విజ్ఞాన్స్‌లో వరల్డ్స్‌ లార్జెస్ట్‌ సెర్వికల్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌

18న విజ్ఞాన్స్‌లో వరల్డ్స్‌ లార్జెస్ట్‌ సెర్వికల్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఈ నెల 18న వరల్డ్స్‌ లార్జెస్ట్‌ సెర్వికల్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్, సీపీవోఐల (కలెక్టివ్‌ పవర్‌ ఆఫ్‌ వన్‌ ఇంటర్నేషనల్, యూఎస్‌ఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అవేర్‌నెస్‌ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌ రోబోటిక్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి, యూఎస్‌ఏ– టెక్సాస్‌లోని సీపీవోఐ ఫౌండర్, సీఈవో డాక్టర్‌ సత్య ఎస్‌.కలంగి, యూఎస్‌ఏ– టెక్సాస్‌లోని సీపీవోఐ బోర్డ్‌ మెంబర్‌ డాక్టర్‌ డేల్‌ క్లైమీ, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ వెంకట సుజాత వెల్లంకిలు హాజరవుతారని తెలియజేసారు. ప్రపంచంలో సెర్వికల్‌ క్యాన్సర్‌ సమస్యతో  ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ, మన దేశంలో అయితే ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మృతి చెందుతున్నారని వెల్లడించారు. దాదాపు 40 దేశాలలో మహిళలలు మృతి చెందుతున్న  ప్రధాన కారణాలలో సెర్వికల్‌ క్యాన్సర్‌ ఒకటిగా నిలుస్తుందన్నారు. సెర్వికల్‌ క్యాన్సర్‌ను సరైన సమయంలో ఎలా గుర్తించాలి అనే అంశాలపై దాదాపు 5 వేల మందికి పైగా మహిళలకు అవగాహన కల్పించేందుకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పూనుకుందని తెలియజేసారు. ఇంతమందికి ఒకేసారి అవగాహన కల్పించడం ఇదే మొదటిసారని.... దీనికై  గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.