రేపటి నుంచే విజ్ఞాన్‌ నిరులోత్సవ్‌–2కే23

రేపటి నుంచే విజ్ఞాన్‌ నిరులోత్సవ్‌–2కే23 
-  జాతీయస్థాయి పోటీలు

     విజ్ఞాన్‌ నిరుల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక

గుంటూరు రూరల్‌ మండలం పలకలూరులోని విజ్ఞాన్‌ నిరుల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో నేటి నుంచి రెండు రోజుల పాటు జాతీయస్థాయి టెక్నికల్, కల్చరల్, ఫైన్‌ ఆర్ట్స్, లిటరరీ, స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక శుక్రవారం తెలిపారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక మాట్లాడుతూ మొదటి రోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ జీ.రాజకుమారి (ఐఏఎస్‌), నరసాపురం జిల్లా సబ్‌ కలెక్టర్‌ అండ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఎం.సూర్యతేజ (ఐఏఎస్‌) హాజరవుతారని పేర్కొన్నారు. ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ అండ్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ కే.వీ. విజయేంద్ర ప్రసాద్, ఇండియన్‌ యాక్టర్‌ అండ్‌ కమెడియన్‌ పీ.ప్రియదర్శిని హాజరవుతారని తెలియజేసారు. ఫెస్ట్‌కు సుమారుగా 200 కళాశాలల నుంచి 15 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు సాంస్కృతిక, క్రీడాంశాల్లో జాతీయస్థాయిలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఎంబీఏ విద్యార్థులతోపాటు డిగ్రీ, ఇంటర్‌ విద్యార్థులు కూడా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.