రేపటి నుంచి విజ్ఞాన్‌లో జాతీయస్థాయి ‘‘సృజనాంకుర–2కే23

రేపటి నుంచి విజ్ఞాన్‌లో జాతీయస్థాయి ‘‘సృజనాంకుర–2కే23’’

 _ఆయా రాష్ట్రాల నుంచి 15వేల మంది విద్యార్థుల      రాక

_ విజేతలకు రూ.9 లక్షల విలువైన నగదు               బహుమతులు


విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో భారీ ప్రణాళిక, వ్యయంతో తమ యూనివర్సిటీ జాతీయస్థాయి సృజనాంకుర ఆవిష్కరణలను నేటి నుంచి రెండురోజుల పాటు నిర్వహిస్తోందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ గురువారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో విజ్ఞాన్‌ సృజనాంకుర–2కే23 పోస్టర్లను ఆవిష్కరించారు. నేడు జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షిబ్‌పూర్‌లోని ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పార్థసారథి చక్రబర్తి, కర్ణాటక– మైసూర్‌లోని ఎక్సెల్‌సాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో సుధన్వ ధనంజయ  హాజరుకానున్నారని వెల్లడించారు. శనివారం జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి, న్యూఢిల్లీలోని బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌ ఎండీ డాక్టర్‌ సరిత అహల్వాత్, నూకాన్‌ ఏరోస్పేస్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరవింద్‌ కే సింగ్, ఏపీ ప్రభుత్వ ఐ అండ్‌ పీ అడ్వైజర్‌ రాజీవ్‌ వైఎస్సార్‌ హాజరవుతారని పేర్కొన్నారు. సృజనాంకురలో భాగంగా భారీ స్థాయిలో శాస్త్ర, సాంకేతిక వైజ్ఞానిక ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. అంతర్జాతీయస్థాయి నైపుణ్యం, నాణ్యతతో కూడిన వేలాది ప్రయోగ నమూనాలను విద్యార్థులు ఈ సందర్భంగా నేడు ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. విజ్ఞాన్‌ సృజనాంకుర 2కే23లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి 15వేల మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని తెలిపారు. రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులను విజ్ఞాన్‌ సృజనాంకుర–2కే23 పోటీల విజేతలకు అందజేస్తామని తెలిపారు. 

మొత్తం 9 కేటగిరీల్లో పోటీలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి సృజనాంకురలో మొత్తం 9 కేటగిరీల్లో పోటీలను నిర్వహించబోతున్నామన్నారు. ఆటోమేషన్, ఇన్ఫ్రా ఇంజినీరింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్, కెమికల్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఫార్మా అండ్‌ లైఫ్‌ సెన్సెస్, ఎలక్ట్రానిక్స్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్, బేసిక్‌ సైన్స్‌ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. వీటిలో  ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో, టెక్నికల్‌ పోస్టర్‌ ప్రజంటేషన్, హ్యాకథాన్, ఐడియాథాన్‌కు సంబంధించిన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. పోటీలలో బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, ఎంసీఏ,ఎంబీఏ, ఎంటెక్‌ విద్యార్థులందరూ పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు, వారిలో పరిశోధనా శక్తిని పెంపొందించేందుకు ఎంతో వ్యయంతో ఈ ఉత్సవాలు చేపబట్టబోతున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.