విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అశ్విని వల్లూరికి  తమ యూనివర్సటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బుధవారం పీహెచ్‌డీ పట్టా అందించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ లో పవర్, ఏరియా ఎఫిసియంట్‌ అండ్‌ రిలియబల్‌ సీఎన్‌టీఎఫ్‌ఈటీ ( కార్భన్‌ నానో ట్యూబ్‌ ఫీల్డ్‌ ఎఫెక్ట్‌ ట్రాన్‌సిస్టర్‌)  బేస్డ్‌ ఎస్‌ఆర్‌ఏఎమ్‌ ( స్టాటిక్‌ రాండమ్‌ యాక్సిస్‌ మెమోరీ) డిజైన్‌ ఫర్‌ ఏ పేస్‌మేకర్‌ డివైస్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.శారద గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 2 ఎస్‌సీఐ, 2 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్, 4 కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. పీహెచ్‌డీ పట్టా పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అశ్విని వల్లూరిని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.