నాలుగో పారిశ్రామిక విప్లవమే స్మార్ట్‌ ఫార్మింగ్‌

నాలుగో పారిశ్రామిక విప్లవమే స్మార్ట్‌ ఫార్మింగ్‌
  హైదరాబాద్‌లోని  ఇక్రిసాట్‌ రీసెర్చ్‌ డెప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌

  విజ్ఞాన్స్‌లో ఘనంగా  ప్రారంభమైన అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌

స్మార్ట్‌ ఫార్మింగ్‌తో రైతులందరూ నాలుగో పారిశ్రామిక విప్లవానికి తెరలేపాలని హైదరాబాద్‌లోని  ఇక్రిసాట్‌ రీసెర్చ్‌ డెప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలోని అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌  డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ క్లైమేట్‌ స్మార్ట్‌ అగ్రికల్చర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో అగ్రికల్చర్, ఫుడ్‌ టెక్నాలజీ రంగాలలో నిష్ణాతులైన 25 మందితో ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ కాన్ఫరెన్స్‌లో రైతులు, అగ్రికల్చర్‌ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ప్రత్యేకమైన 2 ప్యానల్‌ డిస్కషన్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని  ఇక్రిసాట్‌ రీసెర్చ్‌ డెప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ మాట్లాడుతూ స్మార్ట్‌ అగ్రికల్చర్‌ ద్వారా వ్యవసాయం, పశువుల ఉత్పత్తి రంగాలలో ఉద్భవించిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వనరులను గరిష్టంగా వినియోగించడంతో పాటు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి అధిక దిగుబడులు, నాణ్యతను పెంచవచ్చని పేర్కొన్నారు. రైతులందరూ యాంత్రీకరణ సహాయంతో డిజిటల్‌ పరిష్కారాలను వినియోగించాలన్నారు. ప్రపంచ దేశాలలో 2050 నాటికి వ్యవసాయ దిగుబడులు తగ్గటానికి క్లైమేట్‌ చేంజ్‌ అనేది ప్రధాన కారణాలలో ఒకటిగా నిలుస్తుందన్నారు. దాదాపు 55 దేశాలలోని 2.1 బిలియన్‌ మంది ప్రజలు డ్రై లాండ్‌ అగ్రికల్చర్‌ మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న కాలంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో అనుసంధానమయ్యి పనిచేయడానికి కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా ఇక్రిసాట్‌లో ఇంటర్న్‌షిప్‌కు విజ్ఞాన్స్‌ విద్యార్థులను సాదరంగా ఆహ్వానిస్తామన్నారు.

కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఐసీఏఆర్‌ మాజీ డెప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎడ్యుకేషన్, ఉదయపూర్‌లోని ఎమ్‌పీయూఏటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.రాథోర్‌ మాట్లాడుతూ పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ సహాయంతో పంట దిగుబడి తర్వాత దాని రక్షణ, పరిరక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, పంపిణీ, మార్కెటింగ్‌ ఎలా చేయాలో విద్యార్థులకు వివరించారు. 

కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఐఎఫ్‌టీఈఎమ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ సీ.వాసుదేవప్ప మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఫుడ్‌ సప్లై చైన్‌ సిస్టమ్‌లో ప్రస్తుతం భారీగా వృద్ధి నమోదవుతుందన్నారు. ఫుడ్‌ సప్లై సిస్టమ్‌లోని ప్రొడక్షన్, హ్యాండ్లింగ్‌ అండ్‌ స్టోరేజ్, ప్రాసెసింగ్‌ అండ్‌ ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్, రీటైలింగ్, వినియోగం వంటి పద్దతులను విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. అనంతరం అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బీ.శరత్‌బాబు, సీఐఎఫ్‌ఓఆర్‌ – ఐసీఆర్‌ఏఎఫ్‌ డెప్యూటీ చీఫ్‌ డాక్టర్‌ మనోజ్‌ దబాస్, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్‌ మాజీ డైరక్టర్‌ డాక్టర్‌ కేఎస్‌ వరప్రసాద్, , కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌ఆర్‌ నిరంజన, ఐసీఏఆర్‌–సీఆర్‌ఐడీఏ మాజీ డైరక్టర్, వీఎన్‌ఎమ్‌కేవీ మాజీ ఉపకులపతి డాక్టర్‌ బీ.వెంకటేశ్వర్లు, పీపీవీఎఫ్‌ఆర్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌ఆర్‌ హంచినాల్, ఏపీ మాజీ డీజీపీ, విజ్ఞాన్స్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ ఎం.మాలకొండయ్య, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, డీన్‌ ఎస్‌ఏఎఫ్‌టీ, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అగ్రికల్చరల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.