పంచ సూత్రాలతోనే ఉన్నత స్థానాలకు

పంచ సూత్రాలతోనే ఉన్నత స్థానాలకు

- గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ జీ.రాజకుమారి (ఐఏఎస్‌)

 _విల్‌ పవర్‌తో సాధ్యమే : విజ్ఞాన్‌ పూర్వ విద్యార్థి,  నరసాపురం జిల్లా సబ్‌ కలెక్టర్‌ అండ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఎం.సూర్యతేజ (ఐఏఎస్‌)

_  మీ విజయమే నాకు సంతోషం : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య

 _ ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి విజ్ఞాన్‌ నిరులోత్సవ్‌–2కే23

_  మొత్తం 39 విభాగాల్లో ప్రారంభమైన జాతీయస్థాయి పోటీలు

  _15వేల మందికి పైగా హాజరైన విద్యార్థులు

 _ నేటి ముగింపు  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ అండ్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ కే.వీ. విజయేంద్ర ప్రసాద్, ఇండియన్‌ యాక్టర్‌ అండ్‌ కమెడియన్‌ పీ.ప్రియదర్శిని హాజరు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విద్యార్థులు పంచ సూత్రాలను ( వస్త్ర సౌందర్యం, ముఖవర్చుస్సు, మాటతీరు, విద్య, వినయం) సరైన దిశలో వినియోగించినట్లైతే జీవితంలో మీరు అనుకున్న ఉన్నత స్థానాలను సులభంగా అధిరోహించగలరని గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ జీ.రాజకుమారి (ఐఏఎస్‌) అన్నారు. స్థానిక గుంటూరు రూరల్‌ మండలం పలకలూరులోని విజ్ఞాన్‌ నిరుల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజుల పాటు జరగనున్న జాతీయస్థాయి టెక్నికల్, కల్చరల్, ఫైన్‌ ఆర్ట్స్, లిటరరీ, స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ ‘‘ నిరులోత్సవ్‌–2కే23’’ ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ జీ.రాజకుమారి (ఐఏఎస్‌) మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా పనిని ఎఫిసియన్సీతో పాటు ఎఫిక్టివ్‌నెస్‌గా చేస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. విద్యార్థులు బుద్ధితో పాటు మనసును కూడా లగ్నం చేస్తేనే జ్ఞానాన్ని సంపాదించుకోగలరని పేర్కొన్నారు. నాయకత్వ లక్షణాలు, టీమ్‌ స్పిరిట్, క్రమశిక్షణ, నాలెడ్జ్, రెస్పాన్సిబిలిటీ, ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఎప్పడూ సమూహంలో ఒకడిగా ఉండకుండా పది మందికి దారి చూపే దిశలో ఎదగాలన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల పార్టిసిపేషన్‌తో సాధ్యమన్నారు. ఏ సెక్టార్‌నైనా లీడ్‌ చేసే లక్షణాలను మహిళా విద్యార్థులు పెంపొందించుకోవాలన్నారు. మహిళా విద్యార్థులు పాజిటివ్‌ థాట్స్, పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ను కలిగి ఉండి ఎక్కువ మంది విద్యార్థులతో మాట్లాడటం, కొత్త ప్రదేశాలను సందర్శించడం, ప్రకృతిని ఆస్వాదించడం వంటివి చేయడం వలన మానసికంగా ధృఢంగా ఉంటారని పేర్కొన్నారు.

విల్‌ పవర్‌తో సాధ్యమే :  నరసాపురం జిల్లా సబ్‌ కలెక్టర్‌ అండ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఎం.సూర్యతేజ (ఐఏఎస్‌)

విద్యార్థులు ఏదైనా లక్ష్యాన్ని సాధించాలని ధృఢ సంకల్పంతో నిశ్చయించుకుని విల్‌ పవర్‌తో కష్టపడితే సాధించలేనిదంటూ ఏది ఉండదని కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన   నరసాపురం జిల్లా సబ్‌ కలెక్టర్‌ అండ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్, విజ్ఞాన్‌ పూర్వ విద్యార్థి ఎం.సూర్యతేజ (ఐఏఎస్‌) అన్నారు. విజ్ఞాన్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో యాంకర్‌గా చేసిన నేను... ఈ రోజు అదే కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులందరికీ మోటివేషన్‌తో పాటు సెల్ఫ్‌ డిసిప్లేన్‌ ఉండాలన్నారు. విద్యార్థులు ఏదైనా పనిలో నూరు శాతం ఎఫర్ట్‌ పెడితేనే విజయం లభిస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మానవ వనరులే దేశానికి పెద్ద బలమని పేర్కొన్నారు.

మీ విజయమే నాకు సంతోషం : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య
విద్యార్థులు జీవితంలో మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాలను అధిరోహిస్తే... మీకంటే నేనే ఎక్కువగా సంతోషపడతానని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. విజ్ఞాన్‌ నిరులోత్సవ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ లైఫ్‌ స్కిల్స్, టీమ్‌ స్పిరిట్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ వంటివి క్లాస్‌రూమ్‌తో పాటు ఆటల్లో ఎక్కువగా పాల్గొనే విద్యార్థుల్లో త్వరగా డెవలప్‌ అవుతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఉత్సవాల్లో ఎవరైతే ఎక్కువగా పాల్గొంటారో వాళ్లే క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో మొదట ఉద్యోగాలు సాధిస్తారని వెల్లడించారు. గడిచిన 20 సంవత్సరాలల్లో సమాజంలో సోషల్‌ చేంజ్‌ బాగా వచ్చిందన్నారు. ఎకనామిక్‌ డెవలప్‌మెంట్, సోషల్‌ డెవలప్‌మెంట్‌ వంటివి జరగాలంటే మహిళలతోనే సాధ్యమన్నారు. 


39 విభాగాల్లో పోటీలు
విజ్ఞాన్‌ నిరులోత్సవ్‌ జాతీయ ఉత్సవాల్లో భాగంగా మొత్తం 39 అంశాల్లో పోటీలు ప్రారంభించారు. ఉత్సవాలను టెక్నికల్, కల్చరల్, ఫైన్‌ఆర్ట్స్, లిటరరీ, ఎంబీఏ ఈవెంట్స్, స్పోర్ట్స్‌.. ఇలా ఆరు విభాగాలుగా విభజించి ఐడియాథాన్, క్విజిల్లా, కోడ్‌ హంట్, డాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్‌ పరేడ్, స్కిట్, తెలుగమ్మాయి, తెలుగబ్బాయి, స్టాండప్‌ కామెడీ, మీమ్‌ క్రియేషన్, షార్ట్‌ ఫిల్మ్స్, థీమ్‌ పేయింటింగ్, మెహందీ, క్రియేటివ్‌ రైటింగ్, వొకాబులరీ గేమ్స్, గ్రూప్‌ డిస్కషన్, బిజినెస్‌ క్విజ్, యంగ్‌ మేనేజర్, త్రోబాల్, ఖోఖో, టెన్నికాయిట్, షాట్‌పుట్, వాలీబాల్, కబడ్డీ, షటిల్, చెస్, క్యారమ్స్‌ తదితర అంశాల్లో పోటీలు ప్రారంభించారు.  

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
నిరులోత్సవ్‌–2కే23 సంబరాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కళాకారులు పలు నృత్య రూపకాలకు అనుగుణంగా నర్తించి మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖ్యంగా జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఓలలాడించాయి. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, నిరుల ప్రిన్సిపల్‌ పాతూరి రాధిక, కన్వీనర్‌ డాక్టర్‌ వీ.సుజాత, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.