ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధ్యమే

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధ్యమే

  _ రాజ్యసభ సభ్యులు, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ అండ్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ కే.వీ. విజయేంద్ర ప్రసాద్‌

  నిర్ధిష్ట లక్ష్యంతో ముందుకెళ్లాలి : గుంటూరులోని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు

  క్రియేటివిటీకు టెక్నాలజీను జోడించాలి : విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య

  విజ్ఞాన్‌ నిరులలో వైభవంగా ముగిసిన జాతీయ స్థాయి నిరులోత్సవ్‌–2కే23 

  క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థి లోకం

విద్యార్థులు జీవితంలో ఏం సాధించాలన్నా ధైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. అవి ఉంటేనే విజయం మీ సొంతమవుతుందని రాజ్యసభ సభ్యులు, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ అండ్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ కే.వీ. విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. స్థానిక గుంటూరు రూరల్‌ మండలం పలకలూరులోని విజ్ఞాన్‌ నిరుల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి టెక్నికల్, కల్చరల్, ఫైన్‌ ఆర్ట్స్, లిటరరీ, స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ ‘‘ నిరులోత్సవ్‌–2కే23’’ వైభవంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ అండ్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ కే.వీ. విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ జీవితంలో కష్టాలు, సమస్యలు, సవాళ్లు ప్రతి ఒక్కరికీ ఉండేవే. అలాగని కుంగిపోవద్దు. ఎలా పరిష్కరించుకోవాలో మనసు పెట్టి నింపాదిగా ఆలోచిస్తే కచ్చితంగా పరిష్కారాలు దొరుకుతాయన్నారు. పేదరికం, ఆకలిని కఠినంగా అనుభవించిన వాళ్లే జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలను సృష్టించుకుంటారని తెలియజేసారు. ప్రతి విద్యార్థి కూడా మీకాళ్ల మీద మీరు బతకటానికి ప్రయత్నించాలన్నారు. దీని వలన మీలో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసాలు పెంపొందుతాయన్నారు. మహిళా విద్యార్థినుల్లో సవాళ్లను అధిగమించే సామర్థ్య లక్షణాలు ఉన్నాయని.... మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారన్నారు. 

నిర్ధిష్ట లక్ష్యంతో ముందుకెళ్లాలి : గుంటూరులోని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు

విద్యార్థులు రాబోయే 10 సంవత్సరాల్లో ఏమి అవ్వాలనుకుంటున్నారో ముందే నిర్ధిష్ట లక్ష్యాన్ని నిర్ణయించుకుని.... మీ లక్ష్య సాధనకు ప్రతిరోజు కఠోర శ్రమతో ముందుకెళ్లాని నిరులోత్సవ్‌– 2కే23 కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన గుంటూరులోని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు అన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడు లెర్నింగ్‌ ప్రక్రియను ఆపకూడదన్నారు. విద్యార్థులు ఏదైనా పనికి ఎక్కువ సమమాన్ని కేటాయించే బదులు.. అదే పనిని ఇష్టంగా, అభిరుచితో చేయాలన్నారు. మీ కలల సాకారానికి అంకితభావంతో కృషి చేస్తే ఉన్నతంగా ఎదిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని అన్నారు. ఇది సాధించలేనేమో అనే భయం, సందేహాలకు జీవితంలో తావివ్వొద్దని సూచించారు. డబ్బుతో సాధించలేనివి ఎన్నో ప్రేమ, మన్నింపు, ధైర్యంతో సాధించవచ్చని అన్నారు. 


క్రియేటివిటీకు టెక్నాలజీను జోడించాలి : విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య

వినూత్న ఆలోచనలకు కాసింత క్రియేటివిటీ, టెక్నాలజీను జోడించి ఉపయోగించుకుంటే జీవితంలో విద్యార్థులు ముందుకు దూసుకెళ్లి పోవచ్చని  విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య అన్నారు. ఇలాంటి ఉత్సవాలను త్సవాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఒకరితో మరొకరు ఎలా మెలగాలి? బృంద సమూహంగా ఎలా పనిచేయాలినే విషయాలు తెలుస్తాయన్నారు. ప్రతి విద్యార్థి కూడ సామాజిక, మానసిక, భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలన్నారు.

నిరులోత్సవ్‌– 2కే23 విజేతలకు బహుమతులు

జాతీయ స్థాయి విజ్ఞాన్‌ నిరులోత్సవ్‌లో భాగంగా మొత్తం 39 ఈవెంట్లను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు విలువైన నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను, సర్టిఫికెట్లను అందించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులును ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, నిరుల ప్రిన్సిపల్‌ పాతూరి రాధిక, కన్వీనర్‌ డాక్టర్‌ వీ.సుజాత, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.