తీసుకో తేనె సంతకం

*శీర్షిక: తీసుకో తేనె సంతకం!*
************************
*ఎగిరే సీతాకోక చిలుకల*
*విహారం లోనో*
*కురిసే చిరుచినుకుల  సుహారం లొనో,*
*మెరిసే వెండి వెన్నెల శశి గమనంలోనో,*
*దుమికే జలపాతపు సోయగాల సవ్వడి లోనో,*
*నక్షత్రాలు కప్పిన దుప్పటి క్రింద సాగర తీరం లోనో*,
*అడవి మల్లెల పొదలు* *దాటుకుంటూ రంగు రంగుల పక్షుల కువకువలు వింటూనో,*
*నువ్వూ నేనూ* *ఏకాంతంగా,ప్రశాంతంగా, మిణుగురు వెలుగులలో,*
*చల్లగాలి పిల్ల గాలులు కలిసిన చోట ఉన్న వేళ లోనో,*
*పంట చేలో పాలకంకి నవ్విన పచ్చదనం లోనో,*
*నీ ఒడిలో తల పెట్టుకుని ఉన్న రేయి  కదిలి వెళ్ళి పోయే*  *చెట్లను,వెలుగులను, నక్షత్రాలనూ దాటుకుంటూ వెళ్ళే రైలు లోనో,*
*తేనె సంతకం తీసుకో!*
*మన ప్రేమ వంతెనకు బలం* *చేకూర్చుకో! ఎన్ని ఒడి* *దుడుకులున్నా,వచ్చినా,నాకు* *నీవు,నీకు నేనూ కలకాలం* *తోడు వుండే ధృఢ మైన* *బంధానికి, గుండెల్లో ప్రేమ* *వీలునామా రాసుకో!*
*గులాబీ అత్తరు లాంటి* *నమ్మకపు పరీమళాన్ని పూసుకో!*
🪷🌸🪷🌸🪷🌸🪷🌸
*డా. బి హెచ్.వి.రమాదేవి.*
*రాజమహేంద్రవరం*.
*చరవాణి:6305543917*6_3_23*