విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో లలిత హాస్పిటల్‌ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో లలిత హాస్పిటల్‌ అవగాహన ఒప్పందం

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో గుంటూరులోని లలిత సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లలిత సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డీన్, న్యూరో సర్జన్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావుకు వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన తమ యూనివర్సిటీలో 2023–24 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్న నూతన పారామెడికల్‌ కోర్సులకు కావాల్సిన టెక్నాలజీలను అభివృద్ధి చేస్తామన్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులతో పాటు అధ్యాపకులకు  హ్యాండ్స్‌ ఆన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్, వర్క్‌షాప్స్, వాల్యూ యాడెడ్‌ కోర్సులు, స్టూడెంట్‌ ఇంటరాక్టివ్‌ సెషన్స్, అకడమిక్, పరిశోధన, ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ లభిస్తాయన్నారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కొలాబరేటివ్, రివ్యూవింగ్‌ ప్రాజెక్ట్స్, వర్క్‌షాప్స్, మెంటర్‌షిప్‌ ఫర్‌ స్టార్టప్స్, రీసెర్చ్‌ ల్యాబ్స్‌ వసతులను వినియోగించుకోవటం ద్వారా పురోభివృద్ధిని సాధిస్తామని తెలియజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.