జేఈఈ మెయిన్ పరీక్షలో విజ్ఞాన్ విజయపరంపర జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ‘‘విజ్ఞాన్’’ విద్యార్థులు విజయపరంపర మోగించారని విజ్ఞాన్ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో వడ్లమూడి విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జే.మోహనరావు మాట్లాడుతూ మా వద్ద ఐఐటీ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులలో 50 శాతం మంది విద్యార్థులు 90 శాతం పర్సంటైల్ సాధించారు. ఇందులో డీ.నీరజ్ బాబు (99.21), జే.జితేంద్రమోహన్ (98.86), జీ.విష్ణువర్ధన్‌బాబు (98.66), ఎం.జస్వంత్ సాయి (97.51), ఎం.కవిత (97.27), ఎం.దిలీప్‌బాబు (95.85), ఎం.పవన్‌సాయి (95.42), ఏ.సంపత్ (95.27), ఎస్‌కే.ముజీర్ (95.18), ఎస్.శ్రీరామ్ (95.15), వై.ఈశ్వర సుమంత్ (94.96), ఏ.తరుణ్‌మాధవ్ (94.81), ఎం.వరుణ్ (94.75), జే.చంద్రశేఖర్ (94.37), బీ.ఓం సాయిచాంద్ ( 94.34), జే.వీరభద్ర (93.98), ఎం.రేవంత్ కిరణ్ సాయి ( 93.73), కే.వెంకట శివ ప్రణయ్ (93.55), ఎన్. నాగ...