అవసాన దశలో తల్లిదండ్రులకు తోడుగా ఉండండి

అవసాన దశలో తల్లిదండ్రులకు తోడుగా ఉండండి

  హైదరాబాద్‌లోని ఈపీఏఎమ్‌ సిస్టమ్స్‌ సీనియర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ ఇమ్మాన్యుయల్‌ గోసుల

  అసలైన విజేతలు వాళ్లే : హైదరాబాద్‌లోని హిటాచి వంటారా, టాలెంట్‌ అక్విసేషన్‌ మేనేజర్‌ ప్రశాంత్‌ నిడమర్తి

  విజ్ఞాన్‌ మాత్రమే ఇలా: లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌

  పరిమితం అవ్వద్దు : విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు

  విజ్ఞాన్‌లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం

మీ తల్లిదండ్రులు అవసాన దశలోకి చేరిన తర్వాత ప్రతి ఒక్కవిద్యార్థి వారితో కలిసి మెలిసి తోడుగా ఉండాలని హైదరాబాద్‌లోని ఈపీఏఎమ్‌ సిస్టమ్స్‌ సీనియర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ ఇమ్మాన్యుయల్‌ గోసుల అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో చదువుతూ ఈ ఏడాది ప్రాంగణ ఎంపికల ద్వారా ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు శనివారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీలో ఈ ఏడాది మొత్తం 1429 మంది విద్యార్థులు ప్రాంగణ ఎంపికల ద్వారా 100కి పైగా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. మొత్తం మీద 85  శాతం మంది విద్యార్థులు వివిధ ప్రముఖ సంస్థల్లో కొలువులు సాధించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని ఈపీఏఎమ్‌ సిస్టమ్స్‌ సీనియర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ ఇమ్మాన్యుయల్‌ గోసుల మాట్లాడుతూ డబ్బు వెంట ఎవరూ పరుగెత్తవద్దని కష్టపడి పనిచేసుకుంటూ వెళ్తే డబ్బే మన వెంట వస్తుందన్నారు. రెండు వేల రూపాయలతో ప్రయాణం మొదలుపెట్టిన నేను... ఈ రోజు నేను పనిచేస్తున్న కంపెనీ నుంచి 5 దేశాలకు పనిచేసే స్థాయికి ఎదిగానన్నారు. అందుకని ప్రతి ఒక్క విద్యార్థి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు స్కిల్స్‌ అప్‌డేట్‌ చేసుకోవాలన్నారు. ఉద్యోగాలు సాధించి కంపెనీల్లో చేరబోతున్న మీరు... ఇతరులు ఏదైనా చెబుతున్నప్పడు జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త టెక్నాలజీలు మనిషికి హెల్ప్‌ చేయడానికే వస్తున్నాయన్నారు.

అసలైన విజేతలు వాళ్లే : హైదరాబాద్‌లోని హిటాచి వంటారా, టాలెంట్‌ అక్విసేషన్‌ మేనేజర్‌ ప్రశాంత్‌ నిడమర్తి

కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని హిటాచి వంటారా, టాలెంట్‌ అక్విసేషన్‌ మేనేజర్‌ ప్రశాంత్‌ నిడమర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎల్లప్పుడు నిజాయితీగా, పాజిటవ్‌గా, మంచి ప్రవర్తనతో మెలగాలని పేర్కొన్నారు. మీకు ఇష్టం ఉన్న పనులు మాత్రమే చేయండని, ఇష్టం లేని పనులు ఎప్పుడూ చేయకండన్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో మాంద్యం వచ్చిందని ఎవరూ ఆందోళన పడవలసిన ఆవసరం లేదన్నారు. మాంద్యంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకున్న వారే అసలైన విజేతలన్నారు.

విజ్ఞాన్‌ మాత్రమే ఇలా: లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌

విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ మన రాష్ట్రంలోనే ఒక్క విజ్ఞాన్‌ యూనివర్సిటీ మాత్రమే ఇలా తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమాన్ని అనవాయితీగా నిర్వహిస్తోందని తెలిపారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీకి చెందిన 1429 మంది పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో మంచి ఉద్యోగాలు సాధించగలిగారని ఆనందం వ్యక్తంచేశారు. వీరు ఉద్యోగాలు సాధించడం వలన 1429 కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని మార్చడం, వర్సిటీలో చేరిన మొదటి నాలుగునెలల్లోనే విద్యార్థులను ఇంటర్‌ విద్యావ్యవస్థ నుంచి పూర్తిగా బయటకు వచ్చేలా చేయగలగడం, విజ్ఞాన్‌లో చేరే పిల్లల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నారనే ఉద్దేశంతో కేంబ్రిడ్జి యూనివర్సిటీ సహకారంతో ఆంగ్ల భాష నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నన్నాము. నాయకత్వ స్ఫూర్తి, సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించడం కోసం ప్రత్యేక శిక్షణలు కొనసాగించడం, విద్యార్థులతో అధ్యాపకబృందం నిరంతరం మద్దతుగా నిలబడటం లాంటి అంశాల వల్ల విద్యార్థులు విజయం సాధించగలిగారని వివరించారు. 

పరిమితం అవ్వద్దు : విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు

విద్యార్థులు జీవితంలో ఒకదానికే పరిమితం అవ్వద్దని... మీ ఆలోచనలు, ఐడియాలను, సమయాన్ని వివిధ రంగాలలోకి విస్తరించాలని విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నానరు. విద్యార్థులు అన్ని అంశాల్లో చాలా బాగుండబట్టే ఈ స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు సాధించగలిగారని తెలిపారు. ఈ ఉద్యోగంతోనే అంతా సాధించినట్టు కాదని, అసలు సిసలు జీవితం ఇక ఇప్పటి నుంచే మొదలు కానుందని విద్యార్థులను అప్రమత్తం చేశారు. ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, చాట్‌ పీజీటీ వంటి టెక్నాలజీలు యువతకు కొత్త కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఇతర దేశస్థులు రూపొందించిన యాప్స్‌ను వినియోగించే బదులు మనమే సొంతంగా యాప్స్‌ను రూపొందించాలన్నారు. విద్యార్థులందరూ స్టార్టప్స్‌ను మొదలుపెట్టి సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.

విజ్ఞాన్స్‌కు విద్యార్థులే అంబాసిడర్స్‌ : వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు విద్యార్థులే బ్రాండ్‌ అంబాసిడర్స్‌ని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి విజన్‌తో ముందుకెళ్లాలని, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘన సత్కారం అందజేశారు. 

కార్యక్రమంలో కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు,  వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.