అక్రిడిటేషన్ల కమిటీలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కు ప్రాతినిత్యం కల్పించాలి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లను జారీ చేసే  కమిటీలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కు ప్రాతినిత్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం  విడిపోయిన నాటి నుంచి ఏర్పాటైన కమిటీలలో ఏపీడబ్ల్యూజేఎఫ్ కు ప్రాతినిత్యం ఉన్నదని, అతిపెద్ద సంఘంగా రాష్ట్రంలో వేలమంది సభ్యులతో అన్ని జిల్లా కమిటీలతో  ఫెడరేషన్  పని చేస్తున్నదని  జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేసే కమిటీలో జర్నలిస్టు సంఘ ప్రాధాన్యం ఉండడం తప్పనిసరి అని పేర్కొంది.  జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  కు ప్రాతినిధ్యం  కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం పునరాలోచన   చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి  జి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు.
శనివారం ప్రకటనలో ఆయన తెలియజేసారు.