పరిశోధనలు, అభివృద్ధిపై ఇన్వెస్ట్‌ చేయండి

పరిశోధనలు, అభివృద్ధిపై ఇన్వెస్ట్‌ చేయండి
చెన్నైలోని బ్రహ్మాస్త్ర ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్, సీఈవో సుభాష్‌ పీ కుప్పుసామీ

విద్యార్థులందరూ పరిశోధనలు, అభివృద్ధిపై పెట్టుబడి పెట్టండని చెన్నైలోని బ్రహ్మాస్త్ర ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్, సీఈవో సుభాష్‌ పీ కుప్పుసామీ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డీన్‌ ప్రమోషన్స్, కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆఫీస్, విజ్ఞాన్‌ టెక్నాలజీ బిజినెస్‌ ఇంకుబేటర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ టెక్నోలాజికల్‌ కాంపిటీటివ్‌నెస్‌ ఇన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నైలోని బ్రహ్మాస్త్ర ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్, సీఈవో సుభాష్‌ పీ కుప్పుసామీ మాట్లాడుతూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్‌గా ఎదగాలనుకునే విద్యార్థులు ఇన్నోవేషన్, కాస్ట్‌ సేవింగ్స్, కస్టమర్‌ ఎంగేజ్‌మెంట్, గ్లోబల్‌ రీచ్, న్యూ బిజినెస్‌ మోడల్స్, కాంపిటీటివ్‌ అడ్వాంటేజ్, ఫండింగ్, కొలాబరేషన్, డెసిషన్‌ మేకింగ్, ఫ్లెక్సిబిలిటీ, సస్టేనబిలిటీ వంటి అంశాలలో బాగా పట్టు సాధించాలన్నారు. విద్యార్థుల్లో ఎవరికైనా కొత్త ఐడియాలు ఉన్నట్లైతే వాటిని వెంటనే అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేయాలన్నారు. వినియోగదారులు ఆశిస్తున్నటువంటి సర్వీసులను మించి అందించడానికి ప్రయత్నిస్తేనే మనం తయారుచేసిన ప్రాడక్ట్‌ త్వరగా ప్రజల్లోకి వెళ్తుందన్నారు. కార్యక్రమంలో చెన్నైలోని బ్రహ్మాస్త్ర ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ సురేంద్రన్‌ గణేషన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు..